Tag Archives: Digitization process

రేషన్ కార్డుదారులకు అలర్ట్. ఈ తప్పు చేస్తే రేషన్ కట్…?

దేశంలో కోట్ల సంఖ్యలో వినియోగదారులు రేషన్ కార్డ్ ద్వారా ప్రయోజనం పొందుతున్న సంగతి తెలిసిందే. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు అర్హులను చేస్తుంది. అయితే కేంద్రం నిబంధనలలో ఎన్ని మార్పులు చేస్తున్నా కొందరు మాత్రం అక్రమంగా రేషన్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కొందరు అక్రమంగా రేషన్ పొందుతున్నారు.

కేంద్రం ఇప్పటికే అక్రమంగా రేషన్ పొందుతున్న 4.4 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేయగా మరి కొంతమంది రేషన్ కార్డులను రద్దు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రేషన్ కార్డుల ద్వారా అక్రమాలకు తావివ్వకూడదని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే రద్దు చేసిన రేషన్ కార్డులలో అర్హులు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కేంద్రం కల్పిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

కేంద్రం ఇప్పటికే మరణించిన వారి రేషన్ కార్డులను తొలగించడంతో పాటు నకిలీ కార్డులు పొందిన వారికి డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా రేషన్ అందకుండా చేస్తోంది. ఇప్పటివరకు ఎవరైనా రేషన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోకపోతే ఈ నెల 30వ తేదీలోగా అనుసంధానం చేయాలి. అలా అప్ డేట్ చేయని వాళ్లు రేషన్ కోల్పోయే లేదా రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది.

అందువల్ల రేషన్ కార్డు వినియోగదారులు తప్ప్నిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్తులో సమస్యలను తెచ్చుకుని ఇబ్బంది పడే బదులు ముందుగానే రేషన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసి జాగ్రత్త పడితే మంచిది.