Tag Archives: directer Kalathapaswi K Vishwanath

Actress Sharada: మూడుసార్లు నేషనల్ అవార్డు తీసుకున్న ఒక్క సీన్ కోసం 20 టేకులు తీసుకున్న సీనియర్ నటి శారద?

Actress Sharada: సాధారణంగా సినిమాలలో నటించాలంటే అన్ని రకాల ఎమోషన్స్ మనము వ్యక్తపరచాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సన్నివేశానికి అనుగుణంగా నటీనటులు తమహావ భావాలను పలికించాలి. అయితే కొన్నిసార్లు ఎంతో మహానటులు నటీమణులు అయినప్పటికీ కొన్ని సన్నివేశాలు చేయడానికి కాస్త కష్టతరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఎక్కువ టేకులు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ క్రమంలోనే నటి శారద తన సినీ కెరియర్లో ఎన్నో గొప్ప గొప్ప అవార్డులను అందుకోవడమే కాకుండా మూడుసార్లు జాతీయ అవార్డును కూడా అందుకున్నప్పటికీ ఈమె ఒక్క సన్నివేశం చేయడానికి ఏకంగా 20 టేకులు తీసుకోవడం గమనార్హం. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు శారద హీరో హీరోయిన్లుగా వచ్చిన శారద అనే సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయంలో నటించారు.

ఈ సినిమాలో శారద మతిస్థిమితం కోల్పోయిన అమ్మాయిగా కనిపించాల్సి ఉంటుంది. అయితే ఒక సన్నివేశంలో శోభన్ బాబు డాక్టర్ గా ఉండగా శారద సోదరుడు తనని పట్నం తీసుకెళ్లి తన పరిస్థితిని చెప్పగా శోభన్ బాబు తాను పట్నం రావాల్సిన పనిలేదు నేనే తన ఊరికి వస్తానని శారద వెంట తన ఊరికి వెళ్తారు. శోభన్ బాబు లోపలికి రావడం చూసి ఆమె శోభన్ బాబుని తన భర్త అని భావించి తనని ఎందుకు వదిలి వెళ్లారు.. తనకెందుకు అన్యాయం చేశారంటూ కాళ్లపై పడి ఏడ్వాల్సి ఉంటుంది.

Actress Sharada: చివరి టేక్ ఓకే చేసిన డైరెక్టర్…

ఈ సన్నివేశం చేయడం కోసం శారద నుంచి డైరెక్టర్ విశ్వనాథ్ గారికి రావలసిన ఫీల్ రాకపోవడంతో ఆయన ఏకంగా ఈ సన్నివేశం కోసం 20 టేకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా 20 టేకుల చేసిన అనంతరం విశ్వనాథ్ గారు చివరి టేక్ ఓకే చేశారట.నటీనటులను ఏమాత్రం విసుక్కోకుండా తనకు కావలసిన సన్నివేశం కావలసిన విధంగా వచ్చేవరకు విశ్వనాథ్ గారు ఎంతో ఓపికగా ఎన్ని టేక్స్ అయినా కానీ సన్నివేశాన్ని తెరకెక్కించడం ఆయన నైజం. అందుకే ఆయన సినిమాలు ఎంతో సహజంగా ఉంటాయని చెప్పాలి.