Tag Archives: Director Lakshmi Sowjanya

డైరెక్షన్ చేస్తా అన్నందుకు.. నన్ను బెల్టుతో కొట్టారు.. డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య షాకింగ్ కామెంట్స్!

Director Lakshmi Sowjanya: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలా ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్లు నందిని రెడ్డి తర్వాత తెలుగులో వరుడు కావలెను చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈమె చిన్నప్పటినుంచి డైరెక్టర్ కావాలన్న కోరికతో ఈ రంగం వైపు అడుగులు వేస్తూ ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన తర్వాత వరుడు కావలెను చిత్రానికి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.

ఇలా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న లక్ష్మీ సౌజన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. లక్ష్మీ సౌజన్య తండ్రి లెక్కల మాస్టర్ కావడంతో తను కూడా అలాగే టీచర్ కావాలన్న ఉద్దేశంతో తన తండ్రి తనని చదివించారని తెలిపారు. చిన్నప్పుడే చాలా ఎత్తుగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరు తనని చూసి ఇంకా ఆరవ తరగతెనా అంటూ హేళన చేయడంతో ఏకంగా తన తండ్రి పదవతరగతి పరీక్షలు రాయించారని ఇలా పదకొండు సంవత్సరాలకే పదవ తరగతి పూర్తి చేసినట్లు తెలిపారు.

10 పూర్తికాగానే తనకు MEC తీసుకోవాలనే కోరిక ఉండేదని తన తండ్రి మాత్రం ఎంపీసీ తీసుకోవాలని ఒత్తిడి చేసి.. ఎంపీసీ జాయిన్ చేశారని చెప్పారు.అయితే తనకు లెక్కలు అంటే ఏమాత్రం ఇష్టం లేదని తెలిపిన సౌజన్య ఇంటర్ ఫెయిల్ అయ్యారు.ఇలా ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో నాకు చదువు అంటే ఇష్టం లేదు నేను చదవను సినిమాలకు డైరెక్టర్ అవుతానని చెప్పినట్లు వెల్లడించారు.

నచ్చని పనిని అస్సలు చేయను..

ఇలా తను ఇంటర్ ఫెయిల్ అయ్యి సినిమాలలోకి రావాలని ఉందని చెప్పడంతో తన తండ్రి బెల్ట్ తీసుకొని కొట్టారని ఈ ఇంటర్వ్యూలో లక్ష్మీ సౌజన్య వెల్లడించారు. ఇక తాను ఏ విషయమైనా ఒక్కసారి చెప్పానంటే అది తప్పకుండా తీరాలని, తనకు నచ్చని పనిని అసలు ముట్టుకోని లక్ష్మీ సౌజన్య తెలిపారు.ఇక తన నిర్ణయం చెప్పడంతో తన తండ్రి ముందు చదువుకొమ్మని అప్పటికి కూడా సినిమాలపై ఇంట్రస్ట్ ఉంటే అటువైపే పంపిస్తానని మాట ఇచ్చారని ఆ విధంగానే తాను మాస్టర్ డిగ్రీ వరకు చదువు పూర్తి చేసి అనంతరం ఇండస్ట్రీ వైపు వచ్చానని ఈ సందర్భంగా లక్ష్మీ సౌజన్య తెలియజేశారు.