Tag Archives: drinking tea

ఉదయం నిద్ర లేవగానే బెడ్ టీ తాగుతున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు..?

ఉదయం లేవగానే చాలామంది తమ రోజును ఒక కప్పు టీ తో మొదలు పెడుతూ ఉంటారు. నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. కొంతమందికి అయితే ఆర్ టీ తాగకపోతే ఆరోజు అంతా పిచ్చి గా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అంతలా టి కి ఎడిక్ట్ అయిపోయారు. వీటిని చాలా మంది పెద్ద అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు.

అయితే ఇలా ఉదయాన్నే టీ తాగడం వల్ల అది మలబద్ధకానికి దారి తీయడమే కాకుండా, నిధుల పై కూడా ప్రభావం చూపిస్తుందని ఒక నివేదిక హెచ్చరిస్తున్నారు.క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల ఎముకలు పెళుసుగా మారతాయి అని అంటున్నారు. ఉదయం లేవగానే బెడ్ టీ తాగడం చాలా మందికి అలవాటు. ఒక కప్పు టీ లో 20 నుంచి 60 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది.

ఈ కెఫిన్ ఆరోగ్యానికి మంచిది కాదు.ఇలా క్రమం తప్పకుండా టీ తీసుకోవడం వల్ల రక్త నాళాలు కుచించుకుపోయి,రక్త పోటు పెరుగుతుంది. అసిడోసిస్ పెరుగుతుంది. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. ఇలాంటి క్రమంలోనే ఉదయాన్నే కాఫీ తాగే ముందు గోరువెచ్చని నీరు లేదా సాధారణ నీరు తాగండి.

ఇలా గోరువెచ్చని నీరు లేదా సాధారణ నీటిని తాగిన తర్వాత టీ తాగండి. లేదంటే అల్పాహారంగా కొన్ని పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుని ఆ తర్వాత టీ తాగడం మంచిది. నిరంతరం టీ తాగడం వల్ల దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి. అంతేకాకుండా టి ఎక్కువగా తాగడం వల్ల ఊబకాయం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

ఉదయాన్నే ఖాళీ కడపుతో టీ తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకోండి!

ప్రతీ ఒక్కరికీ ఉదయం కాఫీ లేదా టీ తాగడం అలవాటు ఉంటుంది. దాని తర్వాతనే వాళ్ల రోజూ వారి దినచర్యను ప్రారంభిస్తుంటారు. కొంతమందికి ఇలా ఉదయాన్నే టీ తాగకపోతే ఆ రోజు అసలు బుర్రే పనిచేయదు. అయితే ఇదంతా ఇలా ఉండగా.. బ్రష్ చేసిన తర్వాత ఉదయం ఖాళీ కడుపుతోనే టీ తాగడం మంచిదేనా.. దాని వల్ల ఎలాంటి అనర్ధాలు ఉన్నాయి.

వాటి గురించి నిపుణులు ఎమంటున్నారో ఇక్కడ మనం తెలుసుకుందాం.. ఎసిడిటీ ఉన్నవాళ్లు ఇలా ఉదయాన్ని ఖాళీ కడపుతుతో ఛాయ్ తాగడం మంచిది కాదంటూ నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీ లేని వాళ్లు కూడా ఇలా తాగడం మంచిది కాదు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన యాసిడ్ లెవెల్స్ మరింత పెరిగిపోతాయి.

దీనితో ఐరన్ లోపం కలిగి ఎనీమియా సమస్య వస్తుంది. టీ లో కొన్ని నెగెటివ్ ప్రభావం కూడా ఉంటుంది. దీని వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఇది కాన్స్టిపేషన్ సమస్యకు దారితీస్తుంది. టీకి కొంతమంది బానిసగా మారుతారు. ఒక్కరోజు టీ తాగలేదంటే.. పిచ్చివాడిలా ప్రవర్తిస్తుంటారు.దీనికి గల కారణం ఏంటంటే.. నికోటిన్ . పొగాకులో ఉండే నికోటిన్ మాదిరిగానే ఇందులో కూడా ఉంటుంది.

ఇది ఎవరినైనా టీకి బానిసను చేస్తుంది. అలా టీ తాగే సమయం వచ్చిందంటే.. కడుపులో పడాల్సిందే అనే ఫీలింగ్ లో ఉంటారు. అయితే ఇలా చేయడం వ్లల ఉదయం నుంచి వికారం, అలసట లాంటివి వస్తాయి. ఇవి చిన్నగా ఎసిడిటీకి దారి తీస్తాయి. ఇక టీ తాగే అలవాటు ఉండి.. కచ్చతంగా తాగాలి అనే వారు ఉదయం కాస్త.. అల్పాహారం తీసుకొని కొంచెం సమయం తర్వాత టీని తాగితే ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.