Tag Archives: Dussehra festival

RK Roja: టీవీ షోలో మంత్రి రోజాకు అవమానం.. అందుకే పిలిచారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న రోజా?

RK Roja: రోజా పరిచయం అవసరం లేని పేరు ఒకానొక సమయంలో వెండితెర నటిగా ఇండస్ట్రీని ఏలిన రోజా అనంతరం రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా రాజకీయాలలో కొనసాగుతూనే ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు.దాదాపు 10 సంవత్సరాల పాటు జడ్జిగా జబర్దస్త్ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన రోజా ప్రస్తుతం మంత్రి పదవి రావడంతో ఈమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనటువంటి రోజా రాజకీయాలలో బిజీగా ఉన్నారు. అయితే దసరా పండుగ సందర్భంగా మల్లెమాలవారు నిర్వహించినటువంటి స్పెషల్ ఈవెంట్లో రోజా గెస్ట్ గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే రోజా తనదైన శైలిలో అందరిని సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎప్పటిలాగే అందరూ కలిసి ఆటపాటలతో సందడి చేయడమే కాకుండా ఒకరిపై మరొకరు పంచ్ లు వేస్తూ ఎంతో సందడి చేశారు.అయితే ఈ ప్రోమో చివరిలో రోజా ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకొని షో మధ్యలో నుంచి బయటకు వెళ్లిపోయారు.అసలు ఏం జరిగిందో తెలియదు కానీ రోజా మాత్రం ఇలా నన్ను అవమానించడానికి ఇక్కడికి పిలిచారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

RK Roja: కన్నీళ్లు పెట్టుకున్న రోజా..

వేదికపైనే ఈమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవమానంతో షో మధ్యలో నుంచి బయటకు వెళ్లినట్టు ఈ ప్రోమోలో చూపించారు. మరి నిజంగానే రోజాకు అవమానం జరిగిందా లేకపోతే షోపై హైప్ తీసుకురావడానికి ప్రోమో ఇలా కట్ చేశారా అనే విషయం తెలియాలంటే ఈ కార్యక్రమం ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి. ప్రస్తుతం ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

God Father Movie: మలయాళం సినిమాని రీమేక్ చేసి మళ్ళీ అక్కడే విడుదల కానున్న గాడ్ ఫాదర్ ! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయబ్బా?

God Father Movie: సాధారణంగా ఒక భాషలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని తిరిగి ఆ సినిమా ఇతర భాషలలో డబ్ అవుతూ విడుదల కావడం సర్వసాధారణం.అయితే ఒక భాషలో హిట్ అయిన సినిమాని తిరిగి వేరే భాషలో రీమేక్ చేస్తూ ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఎన్నో రీమేక్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా మలయాళ రీమేక్ చిత్రం అనే విషయం మనకు తెలిసిందే.మలయాళంలో సూపర్ హిట్ అయినటువంటి లూసీ ఫర్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసి గాడ్ ఫాదర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమాని కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాని మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు.

God Father Movie: మలయాళ హిట్ సినిమాని తిరిగి మలయాళంలో విడుదల చేయడం…

ఇది తెలిసిన ప్రేక్షకులు ఇలాంటి ఐడియాలన్నీ ఎలా వస్తాయి.. మలయాళంలో హిట్ అయిన సినిమాని తెలుగులో రీమేక్ చేసి తిరిగి ఆ సినిమాని మలయాళం లో డబ్ చేసి విడుదల చేయడం ఏంటి? ఏది ఏమైనా ఇలాంటి ఐడియా ఇచ్చిన వారికి హ్యాట్సాఫ్ అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి మలయాళంలో కూడా విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇకపై ప్రయాణికుల వద్దకే బస్సు సౌకర్యం.. కీలక నిర్ణయం తీసుకున్న టిఎస్ఆర్ట్ సి ఎండీ సజ్జనార్!

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే సామాన్యుడిలా బస్సులో టికెట్ తీసుకొని పలు బస్ స్టేషన్లకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్ లపై అసభ్యకరమైన పోస్టర్లను అంటించవద్దని ఇటీవల ఓ నెటిజన్ ట్విట్టర్లో సజ్జనార్ ను రిక్వెస్ట్ చేయగా.. స్పందించిన సజ్జనార్ వాటిని తొలగించేందుకు ఏర్పాటు చేయాలని.. ఒక్క బస్సుపై కూడా అలాంటి పోస్టర్లు ఉండకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న జీతానికి సబంధించిన సమస్యలను కూడా నెరవేర్చారు. కొన్ని సంవత్సరాలుగా ప్రతీ నెల మొదటి తేదీన పడే జీతాలు.. తర్వాత కొన్ని కారణాల వల్ల నెల 10 నుంచి 15 మధ్యలో జీతాలు క్రెడిట్ అవుతున్నాయి.

వాటికి చరమగీతం పాడుతూ.. ప్రతీ నెల 1నే జీతాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఇదంతా అటు ఉంచితే.. తాజాగా దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల వద్దకే బస్సులను పంపేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది ఆర్టీసీ. హైదరాబాద్ నుంచి ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు కొత్త సౌకర్యాన్ని కల్పించారు. ఏదైనా ప్రదేశం నుంచి 30 లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకే ప్రదేశానికి వెళ్లాలనుకుంటే స్టేషన్ కు రాకుండానే బస్సు వెళ్లి పికప్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు.

కార్మికులు అయినా, విద్యార్థులు అయినా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నారు. నగరంలోని ఎంజీబీఎస్, కోఠి, రేతిఫైల్ బస్టాండ్‌లలో ఫోన్ నంబర్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈ సదుపాయం కావాలనుకుంటే.. 24 గంటల ముందు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాల్సి ఉంటుంది.

ప్రదీప్ ను పెళ్లి చేసుకోబోతున్న శ్రీముఖి.. షాక్ లో నెటిజన్లు..?

బుల్లితెర టీవీ యాంకర్లలో తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్, లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న యాంకర్లలో ప్రదీప్, శ్రీముఖి ముందువరసలో ఉంటారు. పెళ్లి కాని ఈ ఇద్దరు యాంకర్ల పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 22వ తేదీన వీళ్లిద్దరి పెళ్లి జరగబోతుంది. షాక్ అవుతున్నారా…? వీళ్లిద్దరూ జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ఒక షోలో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఇది రీల్ పెళ్లే తప్ప రియల్ పెళ్లి కాదులెండి.

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే టార్గెట్ గా పెట్టుకుని టీవీ ఛానెళ్లు ప్రోగ్రామ్ లను ప్లాన్ చేస్తున్నాయి. అయితే రొటీన్ గా ఉంటే ప్రేక్షకులను అట్రాక్ట్ చేయలేమని భావించి ఛానెల్ నిర్వాహకులు ఇలాంటి ప్రోగ్రామ్ లను క్రియేట్ చేస్తున్నాయి. గతంలో ఒక ప్రముఖ ఛానల్ రష్మీ సుధీర్ లకు కూడా ఇదే విధంగా ప్రోగ్రామ్ లో పెళ్లి చేసింది. క్రియేటివిటీ పేరుతో ఛానల్ నిర్వాహకులు చేస్తున్న ఇలాంటి ప్రయోగాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దసరా పండగ నేపథ్యంలో జీ తెలుగు ఈ వింత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. జెమిని మినహా ఇతర ఛానల్స్ కూడా ఈ తరహా ప్రోగ్రామ్ లను ప్లాన్ చేస్తున్నాయి. ”ఈ లేఖలో ఏముందో తెలుసుకోవాలని ఉందా? అయితే చూడండి దసరా స్పెషల్ ఈవెంట్” అంటూ జీ తెలుగు పెళ్లి పత్రికను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. అయితే నెటిజన్లు మాత్రం ఈ పెళ్లి పత్రిక చూసి టీవీ ఛానెళ్లు ఈ మధ్య పెళ్లిళ్లు కూడా చేస్తున్నాయా..? అని కామెంట్లు చేస్తున్నారు.

టీఆర్పీ కోసం అన్ని ఛానళ్లు చేస్తున్న ఇలాంటి ప్రయోగాలు కొన్నిసార్లు సక్సెస్ అవుతుంటే మరికొన్ని సార్లు ఫ్లాప్ అవుతున్నాయి. మరి జీతెలుగు చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో లేక ఫ్లాప్ అవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.