Tag Archives: eating fish

చేపలు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..! ఇంకా ఎన్నో సమస్యలకు చెక్..

ప్రస్తుతం కరోనా కాలంలో ప్రతీ ఒక్కరూ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి వివిధ రకాల పండ్లను, మాంసాహార పదర్ధాలను తింటున్నారు. మాంసాహార పదర్థాల్లో మనకు ముఖ్యంగా లభించే వాటిల్లో చేపలు ఒకటి. వీటిని ఎక్కువగా ఇష్టపడటానికి గల కారణం ఏంటంటే.. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అందుకే వారంలో కనీసం రెండు సార్లయినా చేపలు తింటే.. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు. చేపలను తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లాంటివి కంట్రోల్‌లో ఉంటాయి. హార్ట్ ఎటాక్, మెదడు సంబంధింత సమస్యల నుంచి కూడా గట్టెక్కవచ్చని పేర్కొంటున్నారు. చేపల్లో కొవ్వు తక్కువగా ఉంటమే కాకుండా అందులో నాణ్యమైన ప్రోటీన్స్ లభిస్తాయి. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. చేపలు తినడం వల్ల.. జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు మెదడు బాగా పనిచేస్తుంది. గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు.

ముఖ్యంగా దీనిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలోని ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీని ఫలితంగానే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. రక్తం సరఫరాకు ఉపయోగపడుతుంది. ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గుతాయి. విటమిన్ డి కూడా లభిస్తుంది. స్త్రీలలో పీరియడ్స్ సక్రమంగా రావాలంటే చేపలు తినాలి. కంటి చూపు మెరుగు అవుతుంది. కంటి సమస్యలు ఉన్నవారు చేపలు తినడం వల్ల సమస్యలు తొలగిపోతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అంతేకాకుండా టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు చేపలు తింటే మంచిదంటుననారు నిపుణులు. రక్త హీనతతో బాధపడేవారు ఈ చేపలు తినడం వల్ల హిమోగ్లీబిన్ సరిపడా ఉండేలా చేస్తుంది. పేగుల్లో గ్యాస్ ఇతరత్రా సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి. శరీర ఉష్ణోగ్రతను చేపలు క్రమబద్ధీకరించి.. శక్తిని అందిస్తాయి. చేపల్లో ఉండే జింక్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు.