Tag Archives: Egg

గుడ్డు శాఖాహారమా.. మాంసాహారమా..? శాస్త్రవేత్తలు తేల్చేశారు..!

కొన్ని ప్రశ్నలకు మనం ఎంత వెతికినా సమాధానం దొరకదు. ఉదాహరణకు చెట్టు ముందా విత్తనం ముందా..? కోడి ముందా గుడ్డు ముందా..? లాంటి ప్రశ్నలు తికమక పెట్టడానికి తప్ప సమాధానం చెప్పడానికి మాత్రం వీలు పడదు.

అయితే చాలా కాలంగా గుడ్డు శాఖాహారమా మాంసాహారమా..? అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. అయితే ఈ ప్రశ్నకు ఇటీవల శాస్త్రవేత్తలు సమాధానం ఇచ్చేశారు. మొదట చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే.. కోడి మాంసాహారం కాబట్టి కోడి నుండి వచ్చిన గుడ్డు కూడా మాంసాహారమే అంటూ గుడ్డుని తినడానికి ఇష్టపడరు. దీనికి చిన్న లాజిక్ఏంటంటే.. పశువు అనేది మాంసాహారి.

మరి ఆ పశువుల నుంచి వచ్చే పాలు కూడా మాంసాహారమే అవ్వాలి.. కానీ శాఖాహారంగా ఎందుకు పరిగణిస్తున్నారని చాలామందికి వచ్చే అనుమానం. అయితే గుడ్డుపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి గుడ్డు అనేది శాఖాహారంగా తేల్చేశారు. ఇక గుడ్డు వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఉడక బెట్టిన గుడ్డు తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయి. ఇక గుడ్డును అనేక రకాలుగా వండుకుని తినొచ్చు. ఒక కోడి మరో కోడితో సంపర్కం జరిగినప్పుడే ఇది మాంసాహారంగా మారుతుంది. కోడి పుట్టిన ఆరు నెలల తరువాత ఒకటి లేదా రెండు రోజులకు గుడ్డును పెడుతుంది. ఈ ప్రక్రియ కోడిపెట్ట లేదా పుంజుతో సంపర్కం అవసరం లేకుండానే జరుగుతుంది. వీటినే అన్‌ఫెర్టిలైజర్ ఎగ్ అంటారు. సాధారణంగా మార్కెట్‌లో లభించే గుడ్లు అన్‌ఫెర్టిలైజర్ అయి ఉంటాయి. కాబట్టి గుడ్డు గురించి ఏం ఆలోచన లేకుండా లాగించేయవచ్చ అంటారు శాస్త్రవేత్తలు.

వామ్మో.. టోపీపై అన్ని గుడ్లా.. ఒక్కటి కూడా పగలకుండా అతడు ఏం చేశాడంటే..?

మనం ఏదైనా దుకాణానికి వెళ్లినప్పుడు గుడ్లు తీసుకురావాలంటే ఎంతో జాగ్రత్తగా తీసుకొస్తాం. ఎందుకంటే ఆ గుడ్లు ఎక్కడ పగులుతాయో అనే భయం ఉంటుంది. ఇలా గుడ్ల విషయంలో చాలా జగ్రత్తగా వ్యవహరిస్తుంటాం. అలాంటిది ఓ వ్యక్తి 735 గుడ్లను కేవలం తన టోపీపై ఉంచుకొని అవి పగలకుండా నడిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

ఏంటి నమ్మడం లేదా.. నిజమేనండి బాబు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ ఆఫ్రికాలోని కేప్‌ టౌన్‌కు చెందిన గ్రెగరీ దా సిల్వా అనే వ్యక్తి ఇటువంటి సాహసాలు ఎన్నో చేశాడు. అందుకే అతడిని చాలామంది ఎగ్ మ్యాన్ అనే పేరు పెట్టారు. ప్రపంచం అంతా తిరిగి తన ట్యాలెంట్ ను చూపించేవాడట. అంతేకాకుండా పలు టెలివిజన్ కార్యక్రమాల్లో ఇలా ప్రదర్శనలు చేయడంతో తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నాడు.

తాజాగా అతడు తన టోపీకి మూడు రోజుల పాటు 735 గుడ్లను అతికించి.. ఆ టోపీని తలపై పెట్టుకున్నాడు. బ్యాలెన్స్ చేస్తూ.. ఒక్క గుడ్డు కూడా పగలకుండా వావ్ అనిపించాడు. దీంతో ప్రపంచంలోనే సింగిల్ టోపీపై ఇన్ని గుడ్లను పెట్టుకొని నడిచిన మొదటి వ్యక్తిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు.

ఇది చైనాలోని సీసీ చానల్ నిర్వహించిన స్పెషల్ షో లో ఈ ఫీట్ సాధించాడు. ప్రస్తుతం అతడు చేసిన ఈ ఫీట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు చాలామంది ఆశ్చర్యపోతూ వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.