మనం ఏదైనా దుకాణానికి వెళ్లినప్పుడు గుడ్లు తీసుకురావాలంటే ఎంతో జాగ్రత్తగా తీసుకొస్తాం. ఎందుకంటే ఆ గుడ్లు ఎక్కడ పగులుతాయో అనే భయం ఉంటుంది. ఇలా గుడ్ల విషయంలో చాలా జగ్రత్తగా వ్యవహరిస్తుంటాం. అలాంటిది ఓ వ్యక్తి 735 గుడ్లను కేవలం తన టోపీపై ఉంచుకొని అవి పగలకుండా నడిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఏంటి నమ్మడం లేదా.. నిజమేనండి బాబు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌కు చెందిన గ్రెగరీ దా సిల్వా అనే వ్యక్తి ఇటువంటి సాహసాలు ఎన్నో చేశాడు. అందుకే అతడిని చాలామంది ఎగ్ మ్యాన్ అనే పేరు పెట్టారు. ప్రపంచం అంతా తిరిగి తన ట్యాలెంట్ ను చూపించేవాడట. అంతేకాకుండా పలు టెలివిజన్ కార్యక్రమాల్లో ఇలా ప్రదర్శనలు చేయడంతో తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నాడు.
తాజాగా అతడు తన టోపీకి మూడు రోజుల పాటు 735 గుడ్లను అతికించి.. ఆ టోపీని తలపై పెట్టుకున్నాడు. బ్యాలెన్స్ చేస్తూ.. ఒక్క గుడ్డు కూడా పగలకుండా వావ్ అనిపించాడు. దీంతో ప్రపంచంలోనే సింగిల్ టోపీపై ఇన్ని గుడ్లను పెట్టుకొని నడిచిన మొదటి వ్యక్తిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు.
ఇది చైనాలోని సీసీ చానల్ నిర్వహించిన స్పెషల్ షో లో ఈ ఫీట్ సాధించాడు. ప్రస్తుతం అతడు చేసిన ఈ ఫీట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు చాలామంది ఆశ్చర్యపోతూ వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…