Tag Archives: emotion post

Actor Surya: హీరో సూర్యని కలిసిన షన్ముఖ్ జస్వంత్… హ్యాపీయెస్ట్ డే అంటూ ఎమోషనల్!

Actor Surya: తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఇప్పటివరకు సూర్య తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి.

Actor Surya: హీరో సూర్యని కలిసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ …హ్యాపీయెస్ట్ డే అంటూ ఎమోషనల్!

తెలుగులో సూర్యకు కేవలం సాధారణ అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ స్టార్ గా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రన్నర్ గా ఉన్న షణ్ముఖ్ జస్వంత్ కూడా పెద్ద అభిమాని అని ఎన్నోసార్లు వెల్లడించారు.

Actor Surya: హీరో సూర్యని కలిసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ …హ్యాపీయెస్ట్ డే అంటూ ఎమోషనల్!

అయితే ప్రస్తుతం సూర్య నటించిన ETసినిమా ఫ్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. అలాగే ఈ సినిమా ప్రమోషన్ కోసం సూర్య హైదరాబాదులో ఉన్నారని తెలియగానే షణ్ముఖ్ జస్వంత్ ఎలాగైనా తన అభిమాన హీరోని కలవాలని వెళ్లారు.ఈ క్రమంలోనే హీరో సూర్య ను కలిసిన షణ్ముఖ్ జస్వంత్ ఒక్కసారిగా ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు.

ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత హ్యాపీగా షన్ను..

సూర్య.. షన్నుని దగ్గరికి తీసుకుని.. అతని యాక్టింగ్ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. సూర్యని కలిసిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తన ఆనందాన్ని తెలియజేశారు. సూర్య అన్నా.. ఐ లవ్ యు.. 3-3-2022.. ఎప్పటికీ హ్యాపీయెస్ట్ డే చాలా రోజుల నుంచి ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత హ్యాపీగా ఉన్నాను. అంటూ తన సంతోషాన్ని తెలియజేశారు.