Actor Surya: తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఇప్పటివరకు సూర్య తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి.
తెలుగులో సూర్యకు కేవలం సాధారణ అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ స్టార్ గా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రన్నర్ గా ఉన్న షణ్ముఖ్ జస్వంత్ కూడా పెద్ద అభిమాని అని ఎన్నోసార్లు వెల్లడించారు.
అయితే ప్రస్తుతం సూర్య నటించిన ETసినిమా ఫ్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. అలాగే ఈ సినిమా ప్రమోషన్ కోసం సూర్య హైదరాబాదులో ఉన్నారని తెలియగానే షణ్ముఖ్ జస్వంత్ ఎలాగైనా తన అభిమాన హీరోని కలవాలని వెళ్లారు.ఈ క్రమంలోనే హీరో సూర్య ను కలిసిన షణ్ముఖ్ జస్వంత్ ఒక్కసారిగా ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు.
సూర్య.. షన్నుని దగ్గరికి తీసుకుని.. అతని యాక్టింగ్ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. సూర్యని కలిసిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తన ఆనందాన్ని తెలియజేశారు. సూర్య అన్నా.. ఐ లవ్ యు.. 3-3-2022.. ఎప్పటికీ హ్యాపీయెస్ట్ డే చాలా రోజుల నుంచి ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత హ్యాపీగా ఉన్నాను. అంటూ తన సంతోషాన్ని తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…