Taapsee:దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మందినాదం అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తాప్సి ఎంతో బిజీగా ఉన్నారు. ఇక కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా లేడి ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా కూడా తాప్సీ బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇక నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిపోయారు.
ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న తాప్సీ గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాప్సీ గత కొద్ది రోజుల నుంచి బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోతో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాప్సీ తన సోదరి షగుణ్ పన్ను ద్వారా మాథియాస్ బో తాప్సీ కలుసుకోవడం జరిగింది. ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.ఇక వీరిద్దరూ గత కొంత కాలం నుంచి ప్రేమలో ఉండగా తాజాగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేది ఎప్పుడు అనే విషయం గురించి క్లారిటీ లేకపోయినా ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…