Uday Kiran: డైరెక్టర్ తేజ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో చిత్రం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో యాభై లక్షల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.అయితే ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా ఏడు కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఉదయ్ కిరణ్ వైపు చూసింది.
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మొదటి సినిమాతోనే ఇలాంటి హిట్ కొట్టడంతో కొందరు లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను,మనసంతా నువ్వే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ కావడంతో చిత్ర పరిశ్రమ మొత్తం ఉదయ్ కిరణ్ వైపు చూసింది. ఏకంగా 11 బడా బ్యానర్లు ఈయనకు అవకాశం ఇచ్చారు.
ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి తన కూతురు సుస్మితకు ఉదయ్ కిరణ్ కి వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అతనితో నిశ్చితార్థం కూడా చేశారు.ఇలా మెగాస్టార్ చిరంజీవి కుమార్తెను ఉదయ్ కిరణ్ కి పెళ్లి చేసుకున్నారనే వార్త తెలియడంతో చాలామంది ఉదయ్ కిరణ్ దశ తిరిగిపోయిందని భావించారు. ఈ నిశ్చితార్థం కోసం ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్లింది.
ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు ఏ విధమైనటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఉదయ్ కిరణ్ కు మెగాస్టార్ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి గల కారణం సుస్మిత ఉదయ్ కిరణ్ ను ఇష్టపడిన కారణంతోనే అని వార్తలు వచ్చాయి. వీరి నిశ్చితార్థం తర్వాత ఈ జంట విదేశాలకు వెళ్లి షికార్లు కొట్టారు. అయితే ఉన్నఫలంగా వీరిద్దరి వివాహం క్యాన్సిల్ అయిందనే వార్త తెలిసింది.అయితే వీరి వివాహం క్యాన్సిల్ అవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఉదయ్ కిరణ్ ప్రవర్తన నచ్చకపోవడం వల్లే సుస్మిత ఈ వివాహం చేసుకోనని చెప్పినట్లు తెలుస్తోంది.
మెగా కాంపౌండ్ కూడా ఉదయ్ కిరణ్ ప్రవర్తనపై సీక్రెట్ గా గమనిస్తూ వచ్చారని వార్తలు వచ్చాయి.అలా ఉదయ్ కిరణ్ తో మెగా కూతురి వివాహం క్యాన్సిల్ అయింది అని తెలియగానే అతనికి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు కూడా అడ్వాన్సు వెనక్కి తీసుకు వెళ్లారు. ఇలా ఉదయ్ కిరణ్ పతనం అప్పటి నుంచి మొదలైంది. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయం కాలేకపోయాయి.ఇక తానే సొంతంగా సినిమా నిర్మించిన అది కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది.ఉదయ్ కిరణ్ విషిత అనే అమ్మాయిని ఎంతో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడం.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో 2014లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…