Tag Archives: everyday

Apple Benefits: మీరు ప్రతిరోజు యాపిల్ పండును తింటున్నారా…అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే!

Apple Benefits: ప్రతి రోజూ ఒక ఆపిల్ పండు తినాలి అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల డాక్టర్ కు దూరంగా కూడా ఉండవచ్చు అనే మాటను మనం వినే ఉంటాము . అలాంటి ఈ యాపిల్ పండును మనం తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూద్దాం…….

Apple Benefits: మీరు ప్రతిరోజు యాపిల్ పండును తింటున్నారా…అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే!

ఆపిల్స్ మనకు చాలా సులభంగా దొరుకుతుంటాయి . ఈ పండ్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆపిల్ పండులో ఉండే ఫైబర్ కారణంగా శరీర బరువును తగ్గించుకోవచ్చు. అలాగే ఇది మధుమేహ వ్యాధి సమస్యలకు క్యాన్సర్ వంటి భయంకర సమస్యలను మెరుగుపరచడంలో కూడా ఈ పండు సహాయ పడుతుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.

Apple Benefits: మీరు ప్రతిరోజు యాపిల్ పండును తింటున్నారా…అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే!


అలర్జీ లను తగ్గిస్తుంది..

అలాగే యాపిల్ స్కిన్‌లో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా శరీరానికి కూడా అందుతాయి. అంతేకాకుండా వాపును తగ్గించడంలోను అలర్జీని, వాయుమార్గం సమస్యలను మెరుగుపరచడంలో కూడా ఈ పండు సహాయం చేస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. కావున చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఈ పండును కనీసం రోజుకు ఒక పండు అయినా తినాలని వైద్యులు చెబుతున్నారు .