Tag Archives: ex wife

Hero Sumanth : కీర్తి నేను విడిపోవడానికి కారణం అదే.. హీరో సుమంత్ షాకింగ్ కామెంట్స్!

Hero Sumanth: అక్కినేని కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి వస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటికీ నలుగురు యంగ్ హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇకపోతే వీరిలో సుమంత్ గురించి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఇకపోతే తాజాగా ఈయన తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.సుమంత్ కెరీర్ మంచి పొజిషన్లో ఉన్న సమయంలో కీర్తి రెడ్డిని ప్రేమించి సుమంత్ ఎంతో ఘనంగా పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన రెండు సంవత్సరాలకి వీరిద్దరి మధ్య పలు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో సుమంత్ అప్పటినుంచి ఒంటరిగా గడుపుతుండగా, కీర్తి రెడ్డి మాత్రం తిరిగి మరో వివాహం చేసుకున్నారు.

Hero Sumanth: కీర్తి నేను విడిపోవడానికి కారణం అదే.. హీరో సుమంత్ షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి సుమంత్ స్పందిస్తూ కీర్తి రెడ్డితో విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటో బయటపెట్టారు. కీర్తి రెడ్డి తాను పెళ్లి కాకముందు మంచి స్నేహితులమని, ఇద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని తెలిపారు. అయితే ఒక జంట విడాకులు తీసుకున్నారు అంటే అది ఇద్దరి వైపుల నుంచి మనస్పర్ధలు ఉంటేనే విడాకుల వరకు వెళ్తాయని సుమంత్ తెలిపారు.

Hero Sumanth: కీర్తి నేను విడిపోవడానికి కారణం అదే.. హీరో సుమంత్ షాకింగ్ కామెంట్స్!

ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంది..

స్నేహితులుగా మాఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది కాని, భార్యాభర్తలుగా మా ఇద్దరి మధ్య రిలేషన్ వర్కవుట్ కాలేదని అందుకే విడాకులు తీసుకున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు.తనకి నేను విడాకులు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా తను నాతో మంచి స్నేహితురాలిగా ఉంటుంది. ప్రస్తుతం తను తిరిగి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తన జీవితం ఎంతో ఆనందంగా ఉందని తన కుటుంబం కూడా నన్ను తన ఫ్యామిలీ మెంబర్ గా చూస్తారని ఈ సందర్భంగా సుమంత్ కీర్తి రెడ్డి గురించి తెలియచేశారు.