Hero Sumanth: అక్కినేని కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి వస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటికీ నలుగురు యంగ్ హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇకపోతే వీరిలో సుమంత్ గురించి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇకపోతే తాజాగా ఈయన తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.సుమంత్ కెరీర్ మంచి పొజిషన్లో ఉన్న సమయంలో కీర్తి రెడ్డిని ప్రేమించి సుమంత్ ఎంతో ఘనంగా పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన రెండు సంవత్సరాలకి వీరిద్దరి మధ్య పలు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో సుమంత్ అప్పటినుంచి ఒంటరిగా గడుపుతుండగా, కీర్తి రెడ్డి మాత్రం తిరిగి మరో వివాహం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఈ విషయం గురించి సుమంత్ స్పందిస్తూ కీర్తి రెడ్డితో విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటో బయటపెట్టారు. కీర్తి రెడ్డి తాను పెళ్లి కాకముందు మంచి స్నేహితులమని, ఇద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని తెలిపారు. అయితే ఒక జంట విడాకులు తీసుకున్నారు అంటే అది ఇద్దరి వైపుల నుంచి మనస్పర్ధలు ఉంటేనే విడాకుల వరకు వెళ్తాయని సుమంత్ తెలిపారు.
స్నేహితులుగా మాఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది కాని, భార్యాభర్తలుగా మా ఇద్దరి మధ్య రిలేషన్ వర్కవుట్ కాలేదని అందుకే విడాకులు తీసుకున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు.తనకి నేను విడాకులు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా తను నాతో మంచి స్నేహితురాలిగా ఉంటుంది. ప్రస్తుతం తను తిరిగి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తన జీవితం ఎంతో ఆనందంగా ఉందని తన కుటుంబం కూడా నన్ను తన ఫ్యామిలీ మెంబర్ గా చూస్తారని ఈ సందర్భంగా సుమంత్ కీర్తి రెడ్డి గురించి తెలియచేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…