Jani Master: నాకు డాన్స్ రాదంటూ వేదికపై నుంచి వెళ్లిపోయిన జానీ మాస్టర్.. బ్యాడ్ అవుతున్నా అంటూ ఆది కామెంట్స్!
Jani Master: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అన్ని భాషలలో స్టార్ హీరోలతో జానీ మాస్టర్ వేయించిన స్టెప్పులు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల తమిళ హీరో విజయ్ తో బీస్ట్ సినిమాలో జానీ మాస్టర్ వేయించిన స్టెప్పులు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన జానీ మాస్టర్ టాలీవుడ్ లో ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోలకు డాన్స్ కంపోజ్ చేస్తుతుంటాడు. అయితే జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీతో బిజీగా ఉండటమే కాకుండా అప్పుడప్పుడు పలు టీవీ షోలలో కూడా సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తున్నాడు. బుల్లితెర మీద ప్రసారమౌతున్న ప్రముఖ డాన్స్ షో ” ఢీ “. ఈ ఢీ షోతో జానీ మాస్టర్ కి ఎంతో అనుబంధం ఉంది. మొదట ఈ షోలో తన కెరీర్ స్టార్ట్ చేసిన జానీ మాస్టర్ తర్వాత ఆ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల జానీ మాస్టర్ ఢీ షోలో తెగ సందడి చేస్తున్నాడు. యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది, జానీ మాస్టర్ మధ్య జరిగే సరదా సన్నివేశాలు ఈ షోకి అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఇటీవల షోకి సంబంధించిన ప్రోమో మొదలైంది. ఈ ప్రోమోలో హైపర్ ఆది, జానీ మాస్టర్ కి మధ్య డాన్స్ కాంపిటీషన్ జరిగింది. జానీ మాస్టర్ స్టెప్పులు వేస్తుంటే ఆది కుప్పిగంతులు వేసాడు. తర్వత ప్రదీప్ వచ్చి ఇద్దరికీ ఎన్ని ఓట్లు వచ్చాయని అనగా.. టై అయిందని ఆది అన్నాడు. దీంతో జానీ మాస్టర్ గతాన్ని గుర్తు చేసుకున్నాడు.
గతంలో జానీ మాస్టర్ చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడు. ముక్కుసూటిగా మాట్లాడుతూ..జడ్జ్‌లను కూడా ఎదురించేవాడు. ఆది టై అయింది అనటంతో జానీ మాస్టర్ గతంలో తను అన్న మాటలు గుర్తు చేశాడు. నాకు డాన్స్ రాదు.. యాక్టింగ్ రాదు.. అందుకే నేనూ వెళ్ళిపోతా అంటూ స్టేజి దిగి వెళ్లిపోతుంటే ఆది మాట్లాడుతూ.. మాస్టర్ మీరు ఇలా చేయటం వల్లే నేను బ్యాడ్ అవుతున్నా అని అంటాడు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగ నవ్వారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…