Rashmika: ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే రష్మిక ఎన్ని కోట్లు సంపాదించిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Rashmika: కన్నడ భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఛలో సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ అమ్మడు గీతా గోవిందం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ సినిమాలో రష్మిక తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
ఇటీవల అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించింది. పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవటంతో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ నిత్యం బిజీగా ఉంటోంది .టాలీవుడ్ లో ఈమె నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్ కావడంతో ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయి.
అన్నీ భాషలలోను టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఈ అమ్మడు ఒక్కో సినిమాకి దాదాపు 4 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. దీంతో హీరోయిన్ గా తక్కువ కాలంలోనే కోట్ల రూపాయల ఆస్తులు కూడకట్టుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన సమయం నుండి రష్మిక 40 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినట్టు సమాచారం. ఇలా ఇండస్ట్రీకి వచ్చిన నాలుగేళ్లలో డబ్బుతో పాటు మంచి పాపులారిటీ కూడా సంపాదించుకుంది.
ప్రస్తుత రష్మిక తెలుగు, హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పుష్ప సినిమా సీక్వెల్ గా పుష్ప2 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక సిద్ధార్థ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిషన్ మజ్ను సినిమాలో చాన్స్ కొట్టేసి ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అంతే కాకుండా అమితాబ్ బచ్చన్ తో కలిసి‘గుడ్ బై’ హిందీ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. హీరోయిన్ గా మాత్రమే కాకుండ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ.. బ్రాండ్ అంబాసిడర్ గా దూసుకుపోతోంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…