Ramgopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివ వంటి సూపర్ హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తన మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఒకప్పుడు స్టార్ దర్శకుడిగా టాలీవుడ్ లో వెలుగొందిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాస్పద దర్శకుడిగా గుర్తింపు పొందారు. ప్రతి విషయానికి నెగటివ్ కామెంట్స్ చేస్తూ.. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు.
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దృష్టి ఆర్ఆర్ఆర్ సినిమా మీద పడింది. ఈ సినిమా గురించి సంచలనమైన కామెంట్స్ చేస్తు మళ్లీ వార్తల్లో నిలిచాడు. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరు తమ నటనతో ఇతర భాషల ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఆన్ స్క్రీన్ రిలేషన్ బాగా పండించటంలో రాజమౌళి సక్సెస్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన ఇన్నిరోజుల తర్వత మరి వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం హాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా మీద నెగటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేయటం. కొంతమంది హాలీవుడ్ ప్రేక్షకులు పని కట్టుకొని మరి ఇది గే తరహా స్టోరీ అని కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలోని కొన్ని సీన్స్ స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గే రిలేషన్షిప్ మూవీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయం గురించి స్పందించారు. సోషియల్ మీడియాలో ద్వారా”నేను చెప్పిందే నిజం..వెస్ట్రన్ ఆడియన్స్ దృక్పథంలో RRR గే స్టోరి” అంటూ కామెంట్స్ చేశాడు. అయితే ఇంత పెద్ద హిట్ సాధించిన ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ ఇలా గే మూవీ అనటంతో కొందరు నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మాటల్లో చెప్పలేని విధంగా భూతులు తిడుతూ ఆర్జీవిని ట్రోల్ చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…