Raghu Kunche: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రఘు కుంచె గురించి అందరికీ తెలిసిందే. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే తనకు డైరెక్టర్ వి.వి.వినాయక్ చాలా దగ్గర బంధుత్వం ఉందని తెలిపారు.
వివి వినాయక్ గారి చెల్లెలు మా బాబాయ్ గారి కొడుకుకి వివాహం చేసుకున్నాము.అలా వి.వి.వినాయక్ వరుసకు బావ అవుతారని ఈ సందర్భంగా రఘు కుంచే వారిద్దరి మధ్య ఉన్న బంధుత్వం గురించి బయట పెట్టారు. ఇకపోతే వి.వి.వినాయక్ బావ కావడంతో ఆయన ద్వారా ఎలాంటి అవకాశాలను అందుకో లేదా అనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు రఘు కుంచే సమాధానం చెబుతూ బావ అనే బంధుత్వాన్ని అడ్డుపెట్టుకొని అవకాశాలు అడగలేము కదా అని సమాధానం చెప్పారు. అయితే ఒకసారి కృష్ణ సినిమా షూటింగ్ చేసేటప్పుడు తనకు అందులో ఒక పాట పాడే అవకాశం కల్పించమని అడిగాను. ఈ విధంగా నేను అడగడంతో వెంటనే డైరెక్టర్ చక్రి గారికి చెప్పి నా చేత ఆ సినిమాలో పాట పాడించారు.
కృష్ణ సినిమాలో నేను పాడిన పాట ఎంతో మంచి విజయం సాధించింది. అయితే మా మధ్య ఉన్న బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని తనని తరచు అవకాశాలు అడగలేక పోయానని ఈ సందర్భంగా తెలిపారు.
ఇకపోతే ఇండస్ట్రీలో ఎంతో మందితో తనకు పరిచయం ఉన్నప్పటికీ తాను తన కొత్త సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ వాట్సప్ ద్వారా వారికి పంపించి ఆ సినిమా వివరాలను కూడా పంపిస్తాను. వారుతమ తరువాత కథను సిద్ధం చేసుకున్నప్పుడు ఫలానా పాత్రకు నేను సరిపోతాను అన్న ఆలోచన వస్తుందేమోనని నా ప్రయత్నం. అయితే నాతో ఎంతో మంచి పరిచయం ఉన్న వారు అలా ఫోటోలు పంపినప్పుడు కనీసం ఓకే అని కూడా రిప్లై ఇవ్వరని ఇలా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు కూడా దూరం పెడతారని రఘు కుంచే ఈ సందర్భంగా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…