Major Movie: ముంబై దాడులలో అంత మంది చనిపోగా.. సందీప్ కథ సినిమా చేయడానికి కారణం అదేనా?
Major Movie: క్షణం సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న అడవి శేషు ప్రస్తుతం మేజర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. 2011 నవంబర్ లో జగిగిన ముంబై దాడుల్లో సందీప్ ఉన్నికృష్ణన్ మరణించాడు. సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథని శశి కిరణ్ తిక్క తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు అనగా జూన్ 3 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.
కరోనా వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ ఇప్పుడూ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాని ‘జీఏంబీ ఎంటర్ టైన్మెంట్’, ‘ఏ ప్లస్ ఎస్ మూవీస్’ తో కలిసి ‘సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా’ నిర్మించింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని హీరో అడవి శేష్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ సినిమా నిర్మాణంలో మహేశ్ బాబు పాత్ర ఉండటంతో ఆయన అభిమానులు కూడా ఈ సినిమా మీద ఆసక్తి చూపుతున్నారు. మేజర్ సినిమా ట్రైలర్, టీజర్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2011లో నవంబర్ లో ముంబై దాడుల్లో ఎంతో మంది మరణించగా కేవలం సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ మాత్రమే ఎందుకు సినిమా తెస్తున్నారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేజర్ సినిమా డైరెక్టర్ శశికిరన్ తిక్క ప్రేక్షకులలో ఉన్న అనుమానాలకు వివరణ ఇచ్చాడు. ఇటీవల ఈ విషయంపై స్పందించిన డైరక్టర్ శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ఉండచ్చు. కానీ ఒక వ్యక్తి మీద కొంతమందికి ఫోకస్ ఉంటుంది. సందీప్ జీవిత కథ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అలా అని మిగిలిన వారు తక్కువ అని అనటంలేదు. మిగిలిన వారిని చూసి కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యుంటారు. వారి గురించి కూడా ఎవరో ఒకరు సినిమా తీయవచ్చు. కానీ నేను సందీప్ జీవిత కథ సినిమా తీసే సమయంలో వారి కుటుంబం కూడా ఎంతో సహకరించింది.కొన్ని సందర్భాలలో బయోపిక్స్ తీసే సమయంలో సమస్యలు అనుకోవాల్సి వస్తుంది . అంతేకాకుండా సందీప్ ఉన్నికృష్ణన్ క్యారెక్టర్ అడివి శేష్ కి బాగా నప్పింది. బయోపిక్ అనేది అందరి ఇష్టంతో సహకారంతో చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా విషయంలో అందరి అభిప్రాయాలు సేకరించి వారి సహకారంతోనే సినిమా తెరకెక్కించాను” అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…