Tag Archives: Exercise

సన్నగా ఉండే వాళ్లు వ్యాయామం, ఎక్సర్‌సైజ్‌లు చేయొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?

చాలామంది బరువు లేదా లావు ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రమే వ్యాయామం చేస్తారని.. సన్నగా ఉన్నవాళ్లకు అవసరం లేదు అని అనకుంటుంటారు. కానీ అది నిజం కాదు. వ్యాయామం అనేది ప్రతీ ఒక్కరికీ అవసరమే. సన్నగా ఉండే వారికి లావుగా ఉండే వారికి వచ్చే సమస్యలు రాకపోవచ్చు కానీ.. మరేదైనా ఇతర సమస్యల వచ్చే అవకాశం ఉంటుంది.

అందుకే వ్యాయామంతో పాటు.. డైట్ అనేది సన్నగా ఉండే వారికి కూడా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే.. సన్నగా ఉండేవారు కోచ్‌ ఆధ్వర్యంలో ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. వాళ్ల బాడీని సిక్స్ ప్యాక్ గా మార్చుకోవాలంటే.. తప్పనిసరిగా.. కోచ్ సమక్షంలోనే చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక స్కిప్పింగ్ విషయానికి వస్తే.. దీనిని ఎవరైనా చేయొచ్చు.. లావుగా ఉండేవారైనా.. సన్నగా ఉండేవారికైనా మంచిదే.

ఎనిమిది నిమిషాల నడక చేస్తే.. 10 నిమిషాల స్కిప్పింగ్ తో సమానం. స్కిప్పింగ్ తాడు ఎంచుకునే సమయంలో జాగ్రత్తగా ఉండలి. మన ఎత్తు కంటే అది రెండింత్తలు ఉండాలి. ఈ స్కిప్పింగ్ అనేది సన్నగా ఉన్నవాళ్లు చేయొచ్చు. దీనికి ఎలాంటి కోచ్ లు అవసరం లేదు. ఇక నడక విషయానికి వస్తే.. ఎవరైనా చేయొచ్చు.

ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది. తిన్న అన్నం జీర్ణం అవుతుంది. అంతే కాకుండా.. కండరాలకు, నరాలకు కాస్తంగా రిలాక్స్ గా అనిపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లాంటివి దరి చేరకుండా ఉంటాయి. రోజూ అరగంట వాకింగ్‌ చేస్తే పెద్ద పేగు క్యాన్సర్‌ వచ్చే ముప్పు చాలావరకు తగ్గుతుందట.

సన్నగా ఉన్న వారు వ్యాయామం చేయాల్సిన అవసరం లేదా..!

సాధారణంగా చాలా లావుగా ఉన్నవారు మాత్రమే వ్యాయామం చేస్తే సరిపోతుంది.సన్నగా, పీలగా ఉన్న వారు వ్యాయామం చేయవలసిన అవసరం లేదని చాలా మంది భావిస్తుంటారు.వ్యాయామం అనేది కేవలం శరీరం సన్నబడటం కోసం చేస్తున్నారు అనుకుంటే పొరపాటు పడినట్లే. వ్యాయామం కేవలం మన శరీరబరువు తగ్గించుకోవడం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం ఎంతగానో దోహదపడుతుంది.

సాధారణంగా అధిక శరీర బరువు ఉన్నవారు వ్యాయామం చేస్తూ శరీర బరువును తగ్గించుకుంటారు. అదేవిధంగా సన్నగా ఉన్న వారు కాస్త ఒళ్ళు చేయాలంటే తప్పనిసరిగా డైట్‌తో పాటు వ్యాయామం తప్పదు. సన్నగా ఉన్నవాళ్లు కోచ్‌ ఆధ్వర్యంలో ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. సన్నగా ఉన్న వారైనా, అధిక శరీర బరువు ఉన్న వారైనా తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం.

పది నిమిషాలు స్కిప్పింగ్ చేయడం, ఎనిమిది నిమిషాల పాటు వాకింగ్ చేయడంతో సమానంగా ఉంటుంది. ఈ విధంగా స్కిప్పింగ్ చేసేటప్పుడు మీరు ఎంపిక చేసుకొనే తాడు మీ ఎత్తుకు రెండింతలు ఉండాలి. అలాగే ఎప్పుడూ ఒకే విధమైన ఎక్సర్సైజులు మాత్రమే కాకుండా క్వాట్స్,మిలటరీ ప్రెస్,డెడ్‌ లిప్ట్, డంబెల్‌ రో,బెచ్‌ ప్రెస్, ప్రయత్నించడం వల్ల కండరాలు ఎంతో బలంగా తయారవుతాయి.

అదేవిధంగా ప్రతిరోజు ఓ అరగంట పాటు నడక తప్పనిసరి. ప్రతి రోజు వాకింగ్ చేయడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి ఇవి తరచూ మనలో కలిగే ఒత్తిడి ఆందోళన నుంచి విముక్తి కలిగించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింప చేస్తాయి.రోజుకు అరగంట పాటు వాకింగ్ చేయడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక వ్యాయామం అనేది కేవలం లావుగా ఉన్నవారు మాత్రమే కాకుండా సన్నగా ఉన్న వారు కూడా చేయడం ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు.