చాలామంది బరువు లేదా లావు ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రమే వ్యాయామం చేస్తారని.. సన్నగా ఉన్నవాళ్లకు అవసరం లేదు అని అనకుంటుంటారు. కానీ అది నిజం కాదు. వ్యాయామం అనేది ప్రతీ ఒక్కరికీ అవసరమే. సన్నగా ఉండే వారికి లావుగా ఉండే వారికి వచ్చే సమస్యలు రాకపోవచ్చు కానీ.. మరేదైనా ఇతర సమస్యల వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకే వ్యాయామంతో పాటు.. డైట్ అనేది సన్నగా ఉండే వారికి కూడా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే.. సన్నగా ఉండేవారు కోచ్ ఆధ్వర్యంలో ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. వాళ్ల బాడీని సిక్స్ ప్యాక్ గా మార్చుకోవాలంటే.. తప్పనిసరిగా.. కోచ్ సమక్షంలోనే చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక స్కిప్పింగ్ విషయానికి వస్తే.. దీనిని ఎవరైనా చేయొచ్చు.. లావుగా ఉండేవారైనా.. సన్నగా ఉండేవారికైనా మంచిదే.
ఎనిమిది నిమిషాల నడక చేస్తే.. 10 నిమిషాల స్కిప్పింగ్ తో సమానం. స్కిప్పింగ్ తాడు ఎంచుకునే సమయంలో జాగ్రత్తగా ఉండలి. మన ఎత్తు కంటే అది రెండింత్తలు ఉండాలి. ఈ స్కిప్పింగ్ అనేది సన్నగా ఉన్నవాళ్లు చేయొచ్చు. దీనికి ఎలాంటి కోచ్ లు అవసరం లేదు. ఇక నడక విషయానికి వస్తే.. ఎవరైనా చేయొచ్చు.
ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది. తిన్న అన్నం జీర్ణం అవుతుంది. అంతే కాకుండా.. కండరాలకు, నరాలకు కాస్తంగా రిలాక్స్ గా అనిపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లాంటివి దరి చేరకుండా ఉంటాయి. రోజూ అరగంట వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ముప్పు చాలావరకు తగ్గుతుందట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…