తెలుగు సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు. ఈయనంటే పడి చచ్చిపోయే అభిమానులున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈయనకు ఉన్నంతగా ఎవరికీ లేదు.. ఇకపై ఎవరికీ రాదు కూడా. అంతలా అతడి సినిమాలకు లేడీస్ టీవీలకు అతుక్కుపోతారు. ఫ్యామిలీకి సంబంధించి సినిమాలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకునేవారు.
చిన్నప్పటి నుంచి కూడా అతడికి సినిమాలంటే ఎంతో ఇష్టపడే వాడంట. తిరువూరులో కీలుగుర్రం తను చూసిన మొదటి సినిమా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు తను బాల్యంలో బాగా అభిమానించిన సినిమాలని, మల్లీశ్వరి సినిమాను 22 సార్లు చూశానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. అతడు ఏదైనా సినిమాకు కథ విని రిజెక్ట్ చేస్తే.. ఆ కథను ఏ హీరో తీసుకునేవాళ్లు కాదట.. అంత ధైర్యం కూడా ఎవరూ చేసేవాళ్లు కాదట.
అయితే ఓ కథను శోభన్ బాబు తిరస్కరిచిన తర్వాత.. మొదటి సారి విక్టరీ వెంకటేష్ దానిని ఓకే చేశారట. అప్పట్లో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎంఎస్ రాజు ఈ కథను శోభన్ బాబుకు వివరించారు.. అంతే కాదు దీనికి తానే నిర్మాతగా వ్యవహరించాలని అనుకుంటున్నా అని చెప్పాడట.
కానీ అతడు ఒప్పుకోకపోవడంతో.. పాటు ఈ సినిమా తీసి మనిద్దరం శత్రువులు కావాలని తాను అనుకోవడం లేదని.. ఈ డబ్బులను ఏదైనా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టండి అంటూ సలహా ఇచ్చారట. కానీ ఇదే సినిమాను కోడి రామకృష్ణ దర్శకత్వం వహించి.. ఎంఎస్ రాజు నిర్మాతగా ‘శత్రువు’ సినిమా తీసి బంపర్ హిట్ కాట్టారు. ఇక ఎంఎస్ రాజు ఈ సినిమాతోనే స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…