Tag Archives: fake news

Pushpa 2: పుష్ప 2 వార్తలన్నీ అవాస్తవమేనా… అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి అభిమానులు?

Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అంతకుమించి పుష్ప 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇక అల్లు అర్జున్ ఏ కార్యక్రమానికి హాజరైన ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ చెబుతూ లీక్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని దాదాపు 85% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా దాదాపు 65% పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్నారు అంటూ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Pushpa 2: పుష్ప అప్డేట్ కావాలి…


ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై సుకుమార్ పిఆర్ఓ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ పుష్ప సినిమా షూటింగ్ గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను ఎవరు నమ్మదు ఈ వార్తలని ఆ వాస్తవమేనని కొట్టి పారేశారు. దీంతో అభిమానులలో కాస్త ఆందోళన నెలకొంది. మరి ఈ సినిమా గురించి వస్తున్నటువంటి వార్తలు అవాస్తవమైతే వాస్తవం ఏంటి వెంటనే ఈ సినిమా నుంచి అప్డేట్ కావాలి అంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

Kriti Shetty: అవన్నీ ఫేక్ న్యూస్ ఎవరు నమ్మదు… తప్పుడు వార్తలపై క్లారిటీ ఇచ్చిన కృతి శెట్టి!

Kriti Shetty: ఉప్పెన సినిమా ద్వారా బేబమ్మగా అందరికీ పరిచయమయ్యారు నటి కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.అయితే గత మూడు సినిమాలు ఈమెకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఇలా మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఈమె సినీ కెరియర్ కాస్త ఇబ్బందులలో ఉందని చెప్పాలి.

ఇకపోతే ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నటువంటి కృతి శెట్టి గురించి ఓ వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈమెను ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక స్టార్ హీరో కుమారుడు చాలా వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఎక్కడికి వెళ్లినా తనకు మనశాంతి లేకుండా తనని టార్చర్ చేస్తున్నారంటూ స్వయంగా ఈమె ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా కృతి శెట్టి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమెను వేధిస్తున్నటువంటి ఆ స్టార్ హీరో ఎవరా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇలా తన గురించి ఈ వార్త రోజు రోజుకు వైరల్ అవడంతో ఎట్టకేలకు ఈ వార్తలపై కృతి స్పందించారు. ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశారు.

Kriti Shetty: ఇలాంటి వాటిని నమ్మను…


నేను ఇలాంటి వార్తలను అసలు నమ్మను. కానీ రోజు రోజుకు ఈ వార్త వైరల్ అవుతుంది. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ ఈ సందర్భంగా కృతి శెట్టి సోషల్ మీడియా వేదికగా తన గురించి వస్తున్నటువంటి వార్తలన్నీ ఆ వాస్తవమని కొట్టి పారేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mangli: ప్రమాద ఘటనపై స్పందించిన సింగర్ మంగ్లీ… కేవలం పుకార్లు అంటూ క్లారిటీ?

Mangli: సింగర్ మంగ్లీ ప్రమాదానికి గురయ్యారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం తెలంగాణ బోనాల పండుగ సందర్భంగా ఈమె బోనాల పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా పాటను పాడి ఆ పాటకు వీడియో చేస్తున్నటువంటి తరుణంలో ప్రమాదానికి గురయ్యారంటూ వార్త వైరల్ గా మారింది.

ఇలా సింగర్ మంగ్లీ ప్రమాదానికి గురి కావడంతో తన కాలికి దెబ్బ తగిలిందని ఆమెను పరీక్షించిన వైద్యులు కొద్దిరోజుల పాటు రెస్ట్ తీసుకోవడం అవసరమని చెప్పడంతో పూర్తిగా ఇంటికి పరిమితం అవుతున్నారంటూ ఓ వార్త సంచలనగా మారింది.

ఇలా మంగ్లీ గురించి ఈ వార్త వైరల్ కావడంతో పెద్ద ఎత్తున తన సన్నిహితులు కంగారుతో తనకు ఫోన్లు చేస్తున్నారని తెలుస్తుంది.ఇలా తన గురించి ఈ విధమైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే మంగ్లీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Mangli: క్షేమంగా ఉన్నాను…


తాను పాట షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురయ్యానంటూ ఓ వార్త వైరల్ గా మారింది. అయితే తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇదంతా కేవలం అవాస్తవాలే అంటూ మంగ్లీ కొట్టి పారేశారు. ఇలా ఈమె ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం తాను చాలా క్షేమంగా సంతోషంగా ఉన్నానని పాట షూటింగ్ కూడా చాలా అద్భుతంగా పూర్తి అయింది అంటూ చెప్పుకొచ్చారు.

Actress Hema: నాకు డ్రగ్స్ కి ఎలాంటి సంబంధం లేదు.. అసత్య ప్రచారాలు చేయకండి: నటి హేమ

Actress Hema: శనివారం బంజారాహిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌ పై పోలీసులు అనూహ్యంగా దాడి చేయడంతో ఎంతో మంది ప్రముఖుల పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Actress Hema: నాకు డ్రగ్స్ కి ఎలాంటి సంబంధం లేదు.. అసత్య ప్రచారాలు చేయకండి: నటి హేమ

ఈ క్రమంలోనే ఇలా అరెస్టు అయిన వారిలో నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఉన్నట్లు పలు మీడియా సంస్థలలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పోలీస్ రైడ్ లో భాగంగా నటి హేమ కూడా అరెస్ట్ అయ్యారని వార్తలు రావడంతో హేమ ఈ వార్తలపై స్పందించారు.

Actress Hema: నాకు డ్రగ్స్ కి ఎలాంటి సంబంధం లేదు.. అసత్య ప్రచారాలు చేయకండి: నటి హేమ

ఈ సందర్భంగా తన గురించి లేనిపోని వార్తలు రావడంతో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు హేమ మీడియాతో మాట్లాడుతూ తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వెల్లడించారు. అసలు తాను ఆ పబ్ కి వెళ్లలేదని, డ్రగ్స్ కేస్ అంటే ఆషామాషీ విషయం కాదని ఈమె వెల్లడించారు.

పబ్ కే వెళ్ళలేదు…

ఇక పబ్ కే వెళ్ళని నాకు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదు కొందరు కావాలనే తనని బ్యాడ్ చేస్తున్నారని, లేనిపోని వార్తలను సృష్టిస్తున్నారని హేమ వెల్లడించారు. తనపై ఈ విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కోసమే ఇక్కడికి వచ్చానని హేమ ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.