Tag Archives: family star movie

Mrunal Thakur: విజయ్ దేవరకొండ వ్యక్తిత్వం పై షాకింగ్ కామెంట్ చేసిన మృణాల్… అలాంటి వ్యక్తి అంటూ?

Mrunal Thakur: సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతోంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు విజయ్ దేవరకొండ తో పాటు నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈమె కూడా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీ అయ్యారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి మృణాల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హీరో విజయ్ దేవరకొండ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈమె విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ హీరో విజయ్ దేవరకొండను అందరు కూడా రౌడీ హీరో ఫ్యామిలీ స్టార్ అని పిలుస్తూ ఉంటారు ఆయన ఈ రెండు కాదని తెలిపారు. విజయ్ సెట్స్ లో కాలా కామ్ గా, కూల్ గా ఉంటారని తెలిపింది.

తన సీన్స్ ను చాలా డిసిప్లయిన్ గా చేస్తుంటారని చెప్పింది. చాలా కూల్ గా ఉంటారు..విజయ్ దేవరకొండ అందరూ అనుకున్నట్టు మాస్ కాదని ఆయన చాలా క్లాస్, చాలా కామ్ గా, రియాలిటీగా, జెన్యూన్ గా ఉంటారని తెలిసింది. ఇక ఈయన గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే తాను రౌడీ స్టార్ ఫ్యామిలీ స్టార్లకు మించిన వ్యక్తిత్వం తనది అంటూ విజయ్ దేవరకొండ గురించి మృణాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Rashmika: రష్మిక పుట్టినరోజు విజయ్ సినిమా విడుదల.. ఆడుకుంటున్న నెటిజన్స్!

Rashmika: సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే అదే రోజు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా కూడా విడుదల తేదీని ఫిక్స్ చేశారు.

దేవర సినిమా విడుదల వాయిదా పడుతుందని ఆ సినిమా వాయిదా పడితే ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదలవుతుందని దిల్ రాజు ఇటీవల వెల్లడించారు. దేవర సినిమా వాయిదా పడిందనే విషయం గురించి అధికారిక ప్రకటన లేకపోయినా దిల్ రాజు మాత్రం ఫ్యామిలీ స్టార్ సినిమాని ఏప్రిల్ 5వ తేదీ విడుదల చేస్తున్నామని అధికారకంగా ప్రకటించారు. దీంతో దేవర వాయిదా పడిందని స్పష్టంగా అర్థమవుతుంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించడంతో మరోసారి ఈ సినిమా వార్తల్లో నిలిచింది. విజయ్ దేవరకొండ నటిస్తున్నటువంటి ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల అంటే అదే రోజే రష్మిక పుట్టినరోజు కావడంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.

ఒకే రోజే సెలబ్రేషన్స్…
రష్మిక పుట్టినరోజు విజయ్ దేవరకొండ సినిమా విడుదల కావడం ఏంటి ఇది అనుకోకుండా జరిగిందా లేక కావాలనే ఇలా డేట్ ఫిక్స్ చేశారా అంటూ పెద్ద ఎత్తున ఈ పోస్టును వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా రష్మిక పుట్టినరోజు ఈ సినిమా విడుదలవడంతో ఈ సినిమాకి ఇలా ప్రమోషన్స్ కలిసి వస్తున్నాయని అదే రోజే ఇద్దరూ కలిసి బర్త్ డే సినిమా సెలబ్రేషన్స్ జరుపుకుంటారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.