Rashmika: సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే అదే రోజు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా కూడా విడుదల తేదీని ఫిక్స్ చేశారు.
దేవర సినిమా విడుదల వాయిదా పడుతుందని ఆ సినిమా వాయిదా పడితే ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదలవుతుందని దిల్ రాజు ఇటీవల వెల్లడించారు. దేవర సినిమా వాయిదా పడిందనే విషయం గురించి అధికారిక ప్రకటన లేకపోయినా దిల్ రాజు మాత్రం ఫ్యామిలీ స్టార్ సినిమాని ఏప్రిల్ 5వ తేదీ విడుదల చేస్తున్నామని అధికారకంగా ప్రకటించారు. దీంతో దేవర వాయిదా పడిందని స్పష్టంగా అర్థమవుతుంది.
ఇక ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించడంతో మరోసారి ఈ సినిమా వార్తల్లో నిలిచింది. విజయ్ దేవరకొండ నటిస్తున్నటువంటి ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల అంటే అదే రోజే రష్మిక పుట్టినరోజు కావడంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.
ఒకే రోజే సెలబ్రేషన్స్…
రష్మిక పుట్టినరోజు విజయ్ దేవరకొండ సినిమా విడుదల కావడం ఏంటి ఇది అనుకోకుండా జరిగిందా లేక కావాలనే ఇలా డేట్ ఫిక్స్ చేశారా అంటూ పెద్ద ఎత్తున ఈ పోస్టును వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా రష్మిక పుట్టినరోజు ఈ సినిమా విడుదలవడంతో ఈ సినిమాకి ఇలా ప్రమోషన్స్ కలిసి వస్తున్నాయని అదే రోజే ఇద్దరూ కలిసి బర్త్ డే సినిమా సెలబ్రేషన్స్ జరుపుకుంటారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…