Tag Archives: festive offers

ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్లు.. లోన్లు తీసుకునే వారికి భారీగా రాయితీలు..

పండుగ సీజన్ రాబోతున్నందును ఎస్‌బీఐ తన కస్టమర్లకు అద్భుత ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పొదుపు ఖాతాలతో పాటు వాహనాలకు సంబంధించిన లోన్లు, బంగారు రుణాలు, గృహ రుణాలు తదితర రుణాలపై కూడా ఆఫర్లు ప్రకటించింది. దీనిలో ముఖ్యంగా కారు లోన్‌ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్‌ రుసుము మినహాయింపుతో పాటు వాహనం ఆన్‌-రోడ్‌ ధరలో 90 శాతం వరకు రుణం పొందే సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

దీనిని కేవలం యోనో యాప్ ద్వారా కారు లోన్ కు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తించనుది. దీనిపై వడ్డీని 0.25 శాతం రాయితీ లభించనుంది. సాధారణంగా యోనో వినియోగదారులకు కార్‌లోన్‌పై వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఇక గోల్డ్ లోన్ రుణాలపై వడ్డీని 0.75 శాతం రాయితీని అందిస్తున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ. అయితే దీనిలో కూడా యోనో యాప్‌ ద్వారా గోల్డ్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు ప్రాసెసింగ్‌ రుసుము పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.

గోల్డ్ లోన్ పై ప్రస్తుతం ఆన్ లైన్, ఆఫ్ లైన్ ల ద్వారా వడ్డీ రేటు 7.5 శాతం ఉంది. ఇక పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. మనం దరఖాస్తును ఎలా సమర్పించినా ప్రాసెసింగ్ ఫీజును మాత్రం 100 శాతం మినహాయింపు ఉంటుందని ప్రకటించారు. వీటిలో కరోనా కాలంలో ముందు ఉండి ప్రజల రక్షణ కొరకు పోరాడిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వీటిపై 0.5 శాతం ప్రత్యేక రాయితీని కల్పించారు. వారికి ఇంకా కార్‌ లోన్‌, గోల్డ్‌ లోన్‌పైనా ఈ ఆఫర్‌ త్వరలో వర్తించనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.

ఇక హోమ్ లోన్ పై కూడా 100 శాతం ప్రెసెసింగ్ ఫీజు రాయితీ ని ఈ నెల 31 వరకు ప్రకటించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా రిటైల్‌ డిపాజిట్‌దారుల కోసం ‘ప్లాటినమ్‌ టర్మ్‌ డిపాజిట్‌’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా, 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలపరిమితి డిపాజిట్‌పై 0.15 శాతం అదనపు వడ్డీ ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. ఈనెల 15 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ టర్మ్‌ డిపాజిట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉండనున్నట్లు ఎస్ బీఐ ప్రకటించింది.

కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు.. ఆ వస్తువులపై 50 శాతం తగ్గింపు..!

దేశంలోని ప్రజలకు ఈ కామర్స్ సైట్లు, ప్రముఖ కంపెనీలు పండుగను ముందుగానే తెస్తున్నాయి. వాషింగ్ మెషీన్, స్మార్ట్ ఫోన్, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. బీపీఎల్, వివో, పానాసోనిక్, రియల్‌మి, శాంసంగ్, ఎల్జీ కంపెనీలు ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్‌పై, ప్రీమియం స్మార్ట్ ఫోన్లను చాలా తక్కువ ధరకే అందించడానికి సిద్ధమవుతున్నాయి.


కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల గతేడాదితో పోలిస్తే కంపెనీలకు భారీగా నష్టాలు వాటిల్లాయి. ప్రీమియం స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్ పై ఏకంగా 50 శాతం తగ్గింపు ఇవ్వడం ద్వారా భారీగా అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ బంపర్ డిస్కౌంట్ల వల్ల వినియోగదారులకు లాభాల శాతం పెరగనుందని, నష్టాల శాతం తగ్గుతుందని తెలుస్తోంది. అయితే కంపెనీలు ఎక్కువ ఖరీదు ఉన్న వస్తువులు, స్మార్ట్ ఫొన్లపైనే ఆఫర్లు అందుబాటులో ఉంచడం గమనార్హం.

ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి పండుగ ఆఫర్ల వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరదని తెలుస్తోంది. స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయాలనుకునే వారికి 10 నుంచి 20 శాతం తక్కువ మొత్తానికే టీవీలు అందుబాటులోకి రానున్నాయి. పానాసోనిక్ ఇండియా సీఈవో మనీశ్ శర్మ ప్రీమియం ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

ఎల్‌జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు తక్కువ డిమాండ్ ఉన్న వస్తువులపై ఆఫర్లు ప్రకటించామని.. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, మైక్రోవేవ్ లాంటి ఎక్కువ డిమాండ్ ఉన్న వస్తువులపై ఆఫర్లు పెద్దగా లేవని తెలిపారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈకామర్స్ సంస్థలు సైతం వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఫ్లిప్‌ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుండగా అక్టోబర్ 17 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.