Tag Archives: follow tips

మధుమేహంతో బాధపడుతున్నారా… అయితే వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో వ్యాధులను వెంటబెట్టుకొని వస్తుంది. ఈ క్రమంలోనే ఈ వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఈ వర్షాకాలంలో మరిన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం.సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహంతో బాధపడే వారు వర్షాకాలంలో అధికంగా జాగ్రత్తలు తీసుకుంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వర్షాకాలంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

వర్షాకాలం అయినప్పటికీ మధుమేహంతో బాధపడేవారు తరచూ నీటిని తాగుతూ ఉండాలి.మధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా మూత్రాశయం వెళ్తుంటారు కనుక వారి శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా అధిక మొత్తంలో నీటిని తీసుకోవాలి. ఈ క్రమంలోనే జ్యూసులు ఇతర పానీయాలకు దూరంగా ఉండాలి.

పచ్చి కూరగాయలు లేదా పచ్చి ఆహార పదార్థాలకు మధుమేహ వ్యాధిగ్రస్తులు వర్షాకాలంలో దూరంగా ఉండటం ఎంతో మంచిది.వర్షాకాలంలో అధికంగా సూక్ష్మ జీవులు ఉంటాయి కనుక వీలైనంత వరకు పచ్చి ఆహార పదార్థాలు, కూరగాయలు తినకూడదు. వాటిని బాగా ఉడికించి తీసుకోవాలి.ఒకవేళ పచ్చి పండ్లు కూరగాయలను తిన్నప్పుడు వాటిని వెనిగర్, నిమ్మరసం, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని తినాలి.

వర్షాకాలం అనేక వ్యాధులకు నిలయం కనుక వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం.కేవలం బ్యాక్టీరియా సూక్ష్మజీవుల నుంచి రక్షణ పొందటమే కాకుండా ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలన్న వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం. అదేవిధంగా ఎలాంటి పరిస్థితులలో కూడా తడిబట్టలతో ఉండకూడదు. వర్షాకాలంలో మధుమేహంతో బాధపడేవారు ఈ విధమైనటువంటి జాగ్రత్తలను తీసుకున్నప్పుడు ఎంతో సురక్షితంగా ఉండగలరని నిపుణులు చెబుతున్నారు.