Tag Archives: ghosts

Dimple Kapadia: ఆ ప్యాలెస్ లో దయ్యాలు ఉన్నాయి.. మా అమ్మ వాటితో మాట్లాడింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ట్వింకిల్ ఖన్నా!

Dimple Kapadia: దెయ్యాలు నిజంగానే ఉన్నాయా అనే ప్రశ్న వేస్తే ఎవరైనా సమాధానం చెప్పడానికి కాస్త ఆలోచిస్తారు. దయ్యాలు ఉన్నాయా లేదా అనే విషయం గురించి ఇప్పటికీ సరైన సమాధానం లేదు. అయితే కొందరు దయ్యాలున్నాయని నమ్ముతారు మరి కొందరు ఇలాంటి మాటలను కొట్టిపారేస్తారు.

Dimple Kapadia: ఆ ప్యాలెస్ లో దయ్యాలు ఉన్నాయి.. మా అమ్మ వాటితో మాట్లాడింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ట్వింకిల్ ఖన్నా!

తాజాగా దయ్యాల గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తల్లి డింపుల్ కపాడియా జైపూర్ లోని రాయల్ ప్యాలెస్ లో దయ్యం ఉందని తన తల్లి ఆ దెయ్యంతో మాట్లాడారని వెల్లడించారు. తన తల్లి 1990లో ‘లేకిన్’సినిమా షూటింగ్ సమయంలో జైపూర్ లోని రాయల్ ప్యాలెస్ లో గడిపారు. అదే గదిలో తన పక్కన ఒక మహిళ ఉండగా తనతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు.

Dimple Kapadia: ఆ ప్యాలెస్ లో దయ్యాలు ఉన్నాయి.. మా అమ్మ వాటితో మాట్లాడింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ట్వింకిల్ ఖన్నా!

ఆ గదిలో తనతో పాటు ఉన్నది దయ్యమని తన తల్లి దయ్యంతో మాట్లాడిందని వెల్లడించారు. ఇక ఈ విషయంపై జైపూర్ రాజవంశీకురాలు, రాజమాత పద్మిని దేవి మాట్లాడుతూ.. జైపూర్ రాయల్ ప్యాలెస్ లో ఎలాంటి దయ్యాలు లేవు. తన తల్లి డింపుల్ కపాడియా సినిమాలో ఒక దెయ్యం పాత్రలో నటించారు.ఆమె రోజంతా అలాంటి పాత్రలో నటించడం వల్ల రాత్రికి కూడా అదే పాత్రలో లీనమై దయ్యం ఉన్నట్లు ఊహించుకున్నారు.

కేవలం తన భ్రమ మాత్రమే..

ఈ విధంగా ఆమె దయ్యం పాత్రలో నటించడం వల్ల తనకు అలాంటి బ్రమ కలిగిందని ఎలాంటి దయ్యాలు లేవని తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా పద్మిని దేవి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రాయల్ ప్యాలెస్ లో ఎలాంటి దయ్యాలు లేవనే విషయం గురించి ఈమె ఇలా క్లారిటీ ఇచ్చారు. గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేకిన్ సినిమాలో డింపుల్ కపాడియా రేవా అనే దెయ్యం పాత్రలో నటించారు.

IIT Director: ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయి..! ప్రొఫెసర్ వ్యాఖ్యలు వైరల్..!

IIT Director: ప్రస్తుతం మన భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా టెక్నాలజీ అభివృద్ధిలో దూసుకుపోతోంది. అంతరిక్షంలోకి కూడా మానవుడు వెళ్తున్నాడంటే.. అర్థం చేసుకోవాలి.. ఎంతలా టెక్నాలజీ ముందుకు సాగుతోందో. అయితే కొన్ని ప్రాంతాలు, పల్లెటూర్లలో మాత్రం ఇంకా మూఢనమ్మకాలు, చాతబడులతోనే ఉంటున్నారు.

IIT Director: ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయి..! ప్రొఫెసర్ వ్యాఖ్యలు వైరల్..!

ఇలా ఎంతో మంది చాతబడులు చేస్తున్నారన్న నెపంతో హత్యలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే సైన్స్ చెబుతున్నది ఏంటంటే.. దెయ్యాలు, చాతబడులు అనేవి లేవు.. కేవలం అవి కల్పితాలు మాత్రమే అని. కానీ ఇక్కడ చెప్పే ఓ న్యూస్ సైన్స్ నే దిక్కరించినట్లు ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

IIT Director: ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయి..! ప్రొఫెసర్ వ్యాఖ్యలు వైరల్..!

ఐఐటీ మండి డైరెక్టర్‌ లక్ష్మీధర్‌ బహేరా సంచలన వ్యాఖ్యలు చేశాడు. దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని తెలిపాడు. 1993లో తన స్నేహితుడి కుటుంబసభ్యులు దెయ్యాల సమస్యతో బాధపడుతుంటే తాను సహాయం చేసినట్టు చెప్పుకొచ్చాడు.


ఫ్రొఫెసర్ ఇలా మాట్లాడటంతో కొంతమంది..

అంతే కాదు.. ఆ దెయ్యాలను పారదోలేందుకు భగవద్గీతలో మంత్రాలు, పూజలు చేసి.. వాటిని పారదోలినట్లు పేర్కొన్నాడు. దీంతో అతడి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఐఐటీ మండి డైరెక్టర్‌గా లక్ష్మీధర్‌ ఇటీవలే నియమితులయ్యారు. ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్‌డీ చేశారు. రోబోటిక్స్‌, కృత్రిమ మేధలో నిష్ణాతులు. ఇంత చదువు చదివిన ఈ ఫ్రొఫెసర్ ఇలా మాట్లాడటంతో కొంతమంది అతడు చెప్పినవి నిజమే అని అంటుంటే మరి కొంమంది మాత్రం అదంతా అబద్దమని.. ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉండటం ఏంటని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా దెయ్యాలు ఉన్నాయని నమ్మే వారు ఎక్కువగా ఉండటం విశేషం.