Dimple Kapadia: దెయ్యాలు నిజంగానే ఉన్నాయా అనే ప్రశ్న వేస్తే ఎవరైనా సమాధానం చెప్పడానికి కాస్త ఆలోచిస్తారు. దయ్యాలు ఉన్నాయా లేదా అనే విషయం గురించి ఇప్పటికీ సరైన సమాధానం లేదు. అయితే కొందరు దయ్యాలున్నాయని నమ్ముతారు మరి కొందరు ఇలాంటి మాటలను కొట్టిపారేస్తారు.
తాజాగా దయ్యాల గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తల్లి డింపుల్ కపాడియా జైపూర్ లోని రాయల్ ప్యాలెస్ లో దయ్యం ఉందని తన తల్లి ఆ దెయ్యంతో మాట్లాడారని వెల్లడించారు. తన తల్లి 1990లో ‘లేకిన్’సినిమా షూటింగ్ సమయంలో జైపూర్ లోని రాయల్ ప్యాలెస్ లో గడిపారు. అదే గదిలో తన పక్కన ఒక మహిళ ఉండగా తనతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు.
ఆ గదిలో తనతో పాటు ఉన్నది దయ్యమని తన తల్లి దయ్యంతో మాట్లాడిందని వెల్లడించారు. ఇక ఈ విషయంపై జైపూర్ రాజవంశీకురాలు, రాజమాత పద్మిని దేవి మాట్లాడుతూ.. జైపూర్ రాయల్ ప్యాలెస్ లో ఎలాంటి దయ్యాలు లేవు. తన తల్లి డింపుల్ కపాడియా సినిమాలో ఒక దెయ్యం పాత్రలో నటించారు.ఆమె రోజంతా అలాంటి పాత్రలో నటించడం వల్ల రాత్రికి కూడా అదే పాత్రలో లీనమై దయ్యం ఉన్నట్లు ఊహించుకున్నారు.
ఈ విధంగా ఆమె దయ్యం పాత్రలో నటించడం వల్ల తనకు అలాంటి బ్రమ కలిగిందని ఎలాంటి దయ్యాలు లేవని తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా పద్మిని దేవి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రాయల్ ప్యాలెస్ లో ఎలాంటి దయ్యాలు లేవనే విషయం గురించి ఈమె ఇలా క్లారిటీ ఇచ్చారు. గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేకిన్ సినిమాలో డింపుల్ కపాడియా రేవా అనే దెయ్యం పాత్రలో నటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…