Lokesh Kangarajan : ఇపుడు అందరూ మాట్లాడుకుంటున్న సినిమా కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్ కలిసి నటించిన విక్రమ్. ఈ సినిమా డ్రగ్స్ నేపథ్యంలో డార్క్ థీమ్ తో సాగే సినిమా. ఈ సినిమా ఇపుడు ఇండియా మొత్తం ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. సినిమా కథలోకి వెళితే కమల్ హాసన్ పాత సినిమా విక్రమ్ స్టోరీ లైన్ కు కొనసాగింపుగా తీసుకున్న కార్తీ సినిమా ఖైదీ సినిమాకు కొనసాగింపుగా కూడా అనిపిస్తుంది. దర్శకుడి స్క్రీన్ ప్లే విధానం ఆకట్టుకుంది. ఇక పోతే ఇపుడు వినిపిస్తున్న మరో మాట సినిమాటిక్ యూనివర్స్, అసలు ఏంటిది అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది.
లోకేష్ యూనివర్స్ లో తమిళ హీరోలు…..
హాలీవుడ్ లో మల్టీ వర్స్ మాములు విషయమే, సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ లో సినిమాలు ఆల్రెడీ వస్తున్నాయి. ఇక తెలుగులో రాజమౌళి బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమాను హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లాడు. బాహుబలి 1 బాహుబలి 2 ద్వారా ఖచ్చితంగా సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పలేము కానీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తో మాత్రం ఆ పనికి చేయిస్తాడని చెప్పొచ్చు. కన్నడ సంచలనం కేజీఎఫ్ చాప్టర్ 1,2 లతో ప్రశాంత్ నీల్ అలాంటి పనే చేసారు. కేజీఎఫ్ సినిమా కొనసాగింపు కేజీఎఫ్ 2 లో అదే స్టోరీ లైన్ కంటిన్యూ చేస్తూ కొత్త పాత్రలను తీసుకొచ్చాడు. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా అలాంటి డార్క్ థీమ్ లోనే తీయనున్నాడు. దీన్ని బట్టి తన యూనివర్స్ లోకి కొత్త హీరోలను యాడ్ చేస్తూ పోతున్నాడని అర్థమవుతోంది. ఇక ఇపుడు తమిళ యువ దర్శకుడు లోకేష్ కూడా అలాంటి ఒక పెద్ద ప్లాన్ లోనే ఉన్నాడని అనిపిస్తోంది. కార్తీ తో తీసిన ఖైదీ, విజయ్ తో తీసిన మాస్టర్, ఇపుడు కమల్ హాసన్ విక్రమ్ ఈ మూడు సినిమాల్లోను కామన్ పాయింట్ డ్రగ్స్.
ఇక విక్రమ్ సినిమా స్టోరీ లైన్ ఖైదీ సినిమా ఎండింగ్ పాయింట్ తో స్టార్ట్ అవుతోంది. కాబట్టి తన సినిమాటిక్ యూనివర్స్ లోకి ఒక్కో హీరోను పవర్ ఫుల్ పాత్రలుగా లోకేష్ కనగరాజన్ మలుస్తున్నాడని అర్థమవుతోంది. ఇక లోకేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రజనీ కాంత్ తో తీయనున్నాడని సమాచారం దీన్ని బట్టి ఒక్కో తమిళ సూపర్ స్టార్ ను తన యూనివర్స్ లోకి తీసుకుని లోకేష్ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతోంది. ఇప్పటికే విజయ్, కార్తీ, సూర్య, కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఈ యూనివర్స్ లో చేరినట్లే. ఇక మున్ముందు ఎలాంటి చిత్రాలు వస్తాయో చూడాలి మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…