Tag Archives: governor

Prabhu Deva: ప్రభుదేవా సినిమాని ఆపేయాలని నిర్మాతకు వార్నింగ్ ఇచ్చిన గవర్నర్.. చివరికి ఏమైందంటే?

Prabhu Deva:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తెరకెక్కించాలి అంటే ఆ సినిమాకి ఎన్నో అవరోధాలు ఏర్పడుతూ ఉండటం సర్వసాధారణం. కొన్ని సినిమాలకు రాజకీయ ఒత్తిళ్లు ఎదురుగా మరికొన్ని సినిమాలకు కొన్ని సామాజిక వర్గాల నుంచి కూడా ఎన్నో వ్యతిరేకతలు ఏర్పడుతుంటాయి. ఈ విధంగా ఆదిలోనే ఎన్నో సినిమాలు ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అర్జున్ ప్రేమ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన జెంటిల్ మెన్ చిత్రం ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందంతో సినిమా చేయాలని నిర్మాత కుంజుమన్ భావించారు.

Prabhu Deva: ప్రభుదేవా సినిమాని ఆపేయాలని నిర్మాతకు వార్నింగ్ ఇచ్చిన గవర్నర్.. చివరికి ఏమైందంటే?

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్ మెన్ సినిమాలో చికుబుకు రైలే అనే పాట ప్రభుదేవా మైకేల్ జాక్సన్ తరహాలో డాన్స్ చేసి మెప్పించారు. ఇకపోతే శంకర్ తన తరువాత ప్రాజెక్టు కుంజుమన్ నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రేమికుడు అనే సినిమా కథను తయారు చేశారు. ఈ సినిమాలో కొత్త వాళ్ళని హీరోగా పెట్టుకోవాలని నిర్మాత భావించారు. అయితే ఇందులో ప్రభుదేవా పేరును నిర్మాత సూచించగా ప్రభుదేవాతో సినిమా చేయడం ఏమాత్రం శంకర్ కు ఇష్టం లేదు. ఇకపోతే నిర్మాత బలవంతంతో ప్రభుదేవా హీరోగా ప్రేమికుడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

Prabhu Deva: ప్రభుదేవా సినిమాని ఆపేయాలని నిర్మాతకు వార్నింగ్ ఇచ్చిన గవర్నర్.. చివరికి ఏమైందంటే?

ఇకపోతే ఈ సినిమా ప్రారంభానికి ముందు ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరోయిన్ తండ్రి గవర్నర్ ఆయన పెద్ద ఎత్తున కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. ఇదే సినిమాకి బలమైన కథాంశమని ప్రతి ఒక్కరు చర్చించుకోవడంతో ఈ విషయం గవర్నర్ కార్యాలయం వరకు చేరింది.

అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు తీసుకోగా గవర్నర్ గా చెన్నారెడ్డి పనిచేస్తున్నారు.అయితే ఒక గవర్నర్ పట్ల చెడుగా ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారని తెలియడంతో గవర్నర్ కార్యాలయం నుంచి నిర్మాతకు బెదిరింపు ఫోన్ కాల్స్ వెళ్లాయి. అయితే నిర్మాత ఏమాత్రం బెదిరి పోకుండా ముఖ్యమంత్రి జయలలితను కలిసి కథ వివరించారు. ఇక ఈ సినిమాని నిరభ్యంతరంగా చేసుకోమని జయలలిత అభయం ఇవ్వడంతో ఈ సినిమా తెరకెక్కింది.

బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించిన ప్రేమికుడు….

ఇక ప్రభుదేవా హీరోగా ఏ మాత్రం ఇష్టం లేని శంకర్ బలవంతంగా ఈ సినిమాని తెరకెక్కించారు.ఇక ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం కూడా ఎంతో ప్లస్ అయ్యింది. ఇక ఇందులో ప్రభుదేవా సరసన నగ్మా మరింత హైలైట్ అయ్యారు. ఈ సినిమాలోని ముక్కాల, ఊర్వశి ఊర్వశి అనే పాట ఇప్పటికీ యువతను ఆకట్టుకుంటుంది. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా 1994 సెప్టెంబర్ 15 వ తేదీ విడుదలయింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టిస్తూ ఎంతో విజయాన్ని అందుకుంది.ఈ విధంగా సినిమా షూటింగ్ కి ముందు గవర్నర్ నుంచి ఎన్నో అభ్యంతరాలు వచ్చినప్పటికీ సీఎం జయలలిత సహాయంతో ఈ సినిమాని తెరకెక్కించే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు.