Tag Archives: govt hospital

దారుణం: ప్రమాదంలో పది మంది చిన్నారులు బలి!

మహారాష్ట్ర జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో అభం శుభం తెలియని నవజాత శిశువులు పదిమంది అగ్నికి ఆహుతయ్యారు. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్ర భండార జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆస్పత్రిలోనిఐసీయూ ఈ విభాగంలో దాదాపు నెల నుంచి మూడు నెలల వయసున్న 17 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఐసీయూ ఈ విభాగంలో ఉన్నఫలంగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఐసీయూ విభాగంలో పనిచేసే వైద్య సిబ్బంది ఏడుగురు చిన్నారులను రక్షించగలగారు. మిగిలిన పదిమంది అగ్నికి ఆహుతయ్యారు. అయితే ఈ ప్రమాదం ఏ కారణం వల్ల చోటు చేసుకుందో తెలియాల్సి ఉంది.ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం భవిష్యత్తులో ఎంతో విలువైన చిన్నారులను కోల్పోయామని,గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని నరేంద్రమోడీ ఆకాంక్షించారు.

మహారాష్ట్రలో జరిగిన ఈ ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపేతో మాట్లాడి విషయంపై ఆరా తీశారు వెంటనే ప్రమాద ఘటనకు కారణాలు తెలియజేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తెలియజేశారు. ఈ ఘటనపై మృతుల బంధువులు స్పందిస్తూ కేవలం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఏమీ తెలియని తమ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు.అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను తొందరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు.