Tag Archives: Growth

Chiranjeevi: తమ్ముడి రాజకీయ ఎదుగుదల కోసమే రాజకీయాల నుంచి తప్పకున్నా.. చిరు కామెంట్స్ వైరల్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా నేడు ఎన్నో అంచనాలను ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది.ఇకపోతే ఈ సినిమా నేడు విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచారు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో రాజకీయాల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి రాజకీయాల గురించి అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు..

ఇదివరకు తాను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్దతు తెలుపుతానని ఎక్కడా చెప్పలేదు భవిష్యత్తులో తెలుపుతానో లేదో కూడా తెలియదు.అయితే ఇద్దరం రాజకీయాలలో ఉండి చరోవైపు ఉండడం మంచిది కాదని భావించి తాను రాజకీయాలనుంచి తప్పకున్నానని, ఇలా రాజకీయాల నుంచి బయటకు రావడం పవన్ కళ్యాణ్ కు రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని చిరంజీవి వెల్లడించారు.

Chiranjeevi: పవన్ కళ్యాణ్ వంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం..

పవన్ కళ్యాణ్ ఒక మంచి నాయకుడు అవుతారు.తనలో ఎలాంటి నిజాయితీ నిబద్ధత ఉందో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అలాంటి ఓ మంచి నాయకుడు రాష్ట్రానికి అవసరం. పవన్ కళ్యాణ్ కు రాష్ట్రాన్ని పరిపాలించే రోజు రావాలని ప్రజలు ఆ అవకాశం తొందరగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుంది _మోదీ

భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పుంజుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణల వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తుతున్నట్లు వెల్లడించారు. సంక్షోభాలను గట్టేకించడంలో కృషి చేసిన పరిశ్రమల నాయకులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల సమాఖ్య 2021 వార్షిక సమావేశంలో మోది వర్చువల్​గా పాల్గొన్నారు.

కాగా ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు వలన భారతదేశంలో ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డ్ లో నమోదు అవడానికి దోహద పడింది మోది అన్నారు.
కంపెనీ స్వదేశానిది కాకపోయినా.. వాటి ఉత్పత్తులు మాత్రం భారత్​లోనే తయారు కావాలనేదే తమ లక్ష్యమన్నారు. దేశంలో ప్రస్తుతం 60 యూనికార్న్​ పరిశ్రమలు ఉన్నాయని.. అందులో 21 కంపెనీలు గడిచిన కొన్ని నెలల్లోనే రికార్డ్ మార్క్​ను అందుకున్నాయని మోదీ తెలిపారు.