Tag Archives: Hyderabad police

సైదాబాద్ నిందితుడిని పట్టుకోవడం కోసం.. మరికొన్ని క్లూ ఇచ్చిన పోలీసులు.. గుండు చేయించుకుంటే ఇలా..

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన పై రెండు తెలుగు రాష్ట్రాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఈ క్రమంలోనే నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలని ఈ నిందితుడు బయట తిరగడానికి వీలు లేదంటూ.. అతనిని ఉరి తీసి చంపాలని పెద్దఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుల్ని పట్టుకోవడం కోసం తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడం కోసం పోలీసులు పది లక్షల రూపాయలు నజరానాలు ప్రకటించారు. నిందితులు ఉపయోగించిన సెల్ఫోన్ ఆధారంగా అతని ఆచూకీ పట్టుకోవడం కష్టతరంగా మారడంతో సిసిటివీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇలా నగరంలో పలు ప్రాంతాల వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాల రికార్డులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

ఇదిలా ఉండగా నిందితులు రాజు వివిధ మారువేషాల్లో తిరుగుతూ ఉంటే అతనిని గుర్తించడం కోసం పోలీసులు పలు ఫోటోలను విడుదల చేశారు. తను గుండు కొట్టించుకుని ఉంటే ఏ విధంగా ఉంటాడు అనేటటువంటి ఊహా చిత్రాలను విడుదల చేశారు. ఎవరికైనా అనుమానాస్పదంగా కనపడితే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని అతని చేతి పై మౌనిక అనే పేరు ద్వారా తనని సులభంగా గుర్తించవచ్చు అని పోలీసులు తనకి సంబంధించిన మరికొన్ని వివరాలను తెలియజేశారు.

సీసీటీవీల ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులకు ఉప్పల్ సిగ్నల్స్ దగ్గర నిందితుడు రోడ్డు క్రాస్ చేస్తూ వెళ్తున్న అటువంటి దృశ్యాలను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక వైన్ షాప్ దగ్గర నిందితుడు తన చేతిలో ఉన్న కవర్ పడేయడంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ కవర్ ను స్వాధీనం చేసుకున్నారు.ఆ కవర్‌లో కల్లు సీసా, టవల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాగైనా నిందితుడిని మరో 24 గంటలలో పట్టుకోవాలని హైదరాబాద్ పోలీసులు పలు ప్రాంతాలలో అతని ఫోటోలు చూపిస్తూ గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఒక్క తప్పుతో గన్ ఫైర్ చేసిన నిందితులను గంటలోనే పట్టేసిన పోలీసులు.. ఎక్కడంటే!

హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఏటీఎం సెంటర్ దగ్గర తుపాకీ కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిందితులు కాల్పులు జరిపి ఏటీఎం లోని నగదును దోచుకెళ్లారు. అయితే ఈ ఘటన జరిగిన కొద్ది గంటలలోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు.నిందితులు నాదెండ్ పారిపోతుండగా సంగారెడ్డిలో ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ తుపాకీ ఫైరింగ్ కేసును కేవలం గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించి నిందితులను పట్టుకోగలిగారు. ఈ కాల్పులు జరిపినది పాత నిందితులేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 15 రోజుల క్రితం జీడిమెట్లలో జరిగిన దోపిడీ కేసులో కూడా వీళ్ళకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.జీడిమెట్లలో ఓ సేల్ షాప్ యజమానికి తుపాకీతో బెదిరించి లక్ష రూపాయల నగదుతో పాటు సెల్ ఫోన్లు తీసుకెళ్లి పోయారు.అయితే ఈ కేసులో నిందితుల కోసం గాలిస్తున్న క్రమంలోనే కూకట్ పల్లి ఘటన జరిగింది.

జీడిమెట్ల నిందితులే కూకట్ పల్లిలోని ఏటీఎం సెంటర్‌లో మళ్లీ ఇలా కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.ఈ విధంగా రెండు చోట్ల దోపిడీలకు, కాల్పులకు పాల్పడింది ఒకరేనని నిర్ధారణ చేసుకున్న పోలీసులు వారిని గాలించడం కోసం ఆరు బృందాలుగా విడిపోయారు.కూకట్ పల్లిలోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం సెంటర్‌లో వీరు దోపిడీ చేశారు. ఈ సమయంలో అడ్డం వచ్చిన ఇద్దరి పై కాల్పులు జరపగా ఒకరు చికిత్స తీసుకుంటూ మరణించారు. ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు వేగంగా ప్రారంభించగా నిందితులను నాదెండ్ పరిసర ప్రాంతాలలో సంగారెడ్డి ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.