హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఏటీఎం సెంటర్ దగ్గర తుపాకీ కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిందితులు కాల్పులు జరిపి ఏటీఎం లోని నగదును దోచుకెళ్లారు. అయితే ఈ ఘటన జరిగిన కొద్ది గంటలలోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు.నిందితులు నాదెండ్ పారిపోతుండగా సంగారెడ్డిలో ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ తుపాకీ ఫైరింగ్ కేసును కేవలం గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించి నిందితులను పట్టుకోగలిగారు. ఈ కాల్పులు జరిపినది పాత నిందితులేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 15 రోజుల క్రితం జీడిమెట్లలో జరిగిన దోపిడీ కేసులో కూడా వీళ్ళకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.జీడిమెట్లలో ఓ సేల్ షాప్ యజమానికి తుపాకీతో బెదిరించి లక్ష రూపాయల నగదుతో పాటు సెల్ ఫోన్లు తీసుకెళ్లి పోయారు.అయితే ఈ కేసులో నిందితుల కోసం గాలిస్తున్న క్రమంలోనే కూకట్ పల్లి ఘటన జరిగింది.
జీడిమెట్ల నిందితులే కూకట్ పల్లిలోని ఏటీఎం సెంటర్‌లో మళ్లీ ఇలా కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.ఈ విధంగా రెండు చోట్ల దోపిడీలకు, కాల్పులకు పాల్పడింది ఒకరేనని నిర్ధారణ చేసుకున్న పోలీసులు వారిని గాలించడం కోసం ఆరు బృందాలుగా విడిపోయారు.కూకట్ పల్లిలోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం సెంటర్‌లో వీరు దోపిడీ చేశారు. ఈ సమయంలో అడ్డం వచ్చిన ఇద్దరి పై కాల్పులు జరపగా ఒకరు చికిత్స తీసుకుంటూ మరణించారు. ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు వేగంగా ప్రారంభించగా నిందితులను నాదెండ్ పరిసర ప్రాంతాలలో సంగారెడ్డి ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…