ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులలో సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తోంది. ఆక్సిజన్ లేక కొన ఊపిరితో అల్లాడుతున్న భారతావని ఆదుకునే వారి కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరగడంతో హాస్పిటల్లో ఆక్సిజన్ లేకపోవడంతో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎంతోమంది తమ వంతు సహాయం చేస్తూ ఎందరికో ప్రాణాలను నిలుపుతున్నారు. ఈ జాబితాలోనే ఒక సాధారణ ఆటో డ్రైవర్ ఉండటం విశేషం.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన 34 ఏళ్ల జావెద్ ఖాన్ అనే ఆటో డ్రైవర్ తన ఆటోను అంబులెన్సుగా మార్చి ఎంతోమంది బాధితులకు తన వంతు సాయంగా కృషి చేస్తున్నాడు.ఆటో నడుపుతూ కుటుంబం గడుపుకునే జావెద్ ఈ విపత్కర పరిస్థితులలో తోటి భారతీయులకు సహాయం చేయాలనే పెద్ద మనసుతో ముందుకొచ్చాడు. తనకు ఉన్న ఆటోను అంబులెన్స్ గా మార్చాడు. ఆ ఆటోలో ఆక్సిజన్ సిలిండర్, శానిటైజర్, మాస్కులు వంటి వాటిని ఉంచుకొని కరోనా బాధితులకు సహాయం చేస్తున్నాడు.
జావెద్ ఇదంతా డబ్బులు ఆశించి కాదు ఉచితంగానే బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు.ఆక్సిజన్ సిలిండర్ నింపేందుకు జావెద్ రోజుకు రూ.600 ఖర్చు చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు సాధారణ ప్రయాణికులను తన ఆటోలో ఎక్కించుకోకుండా కేవలం కరోనా బాధితులను మాత్రమే ఎక్కించుకొని ని వారికి అత్యవసర సమయంలో సహాయం చేస్తున్నాడు.
గత మూడు రోజుల నుంచి జావెద్ దాదాపు 10 మంది ప్రాణాలను కాపాడినట్లు తెలుస్తోంది. ఒక సాధారణ వ్యక్తిగా మానవతా దృక్పథంతో ఈ విపత్కర పరిస్థితులలో జావెద్ లాంటి వ్యక్తులు సొంత ఖర్చులతో రోగులకు సేవలను అందించడం పట్ల ఇతని పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…