ఆటోను అంబులెన్స్ గా మార్చి ఆక్సిజన్ తో సహా అన్నీ ఉచితంగా ఇస్తున్న యువకుడు!

0
51

ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులలో సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తోంది. ఆక్సిజన్ లేక కొన ఊపిరితో అల్లాడుతున్న భారతావని ఆదుకునే వారి కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరగడంతో హాస్పిటల్లో ఆక్సిజన్ లేకపోవడంతో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎంతోమంది తమ వంతు సహాయం చేస్తూ ఎందరికో ప్రాణాలను నిలుపుతున్నారు. ఈ జాబితాలోనే ఒక సాధారణ ఆటో డ్రైవర్ ఉండటం విశేషం.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన 34 ఏళ్ల జావెద్ ఖాన్ అనే ఆటో డ్రైవర్ తన ఆటోను అంబులెన్సుగా మార్చి ఎంతోమంది బాధితులకు తన వంతు సాయంగా కృషి చేస్తున్నాడు.ఆటో నడుపుతూ కుటుంబం గడుపుకునే జావెద్ ఈ విపత్కర పరిస్థితులలో తోటి భారతీయులకు సహాయం చేయాలనే పెద్ద మనసుతో ముందుకొచ్చాడు. తనకు ఉన్న ఆటోను అంబులెన్స్ గా మార్చాడు. ఆ ఆటోలో ఆక్సిజన్ సిలిండర్, శానిటైజర్, మాస్కులు వంటి వాటిని ఉంచుకొని కరోనా బాధితులకు సహాయం చేస్తున్నాడు.

జావెద్ ఇదంతా డబ్బులు ఆశించి కాదు ఉచితంగానే బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు.ఆక్సిజన్ సిలిండర్ నింపేందుకు జావెద్ రోజుకు రూ.600 ఖర్చు చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు సాధారణ ప్రయాణికులను తన ఆటోలో ఎక్కించుకోకుండా కేవలం కరోనా బాధితులను మాత్రమే ఎక్కించుకొని ని వారికి అత్యవసర సమయంలో సహాయం చేస్తున్నాడు.

గత మూడు రోజుల నుంచి జావెద్ దాదాపు 10 మంది ప్రాణాలను కాపాడినట్లు తెలుస్తోంది. ఒక సాధారణ వ్యక్తిగా మానవతా దృక్పథంతో ఈ విపత్కర పరిస్థితులలో జావెద్ లాంటి వ్యక్తులు సొంత ఖర్చులతో రోగులకు సేవలను అందించడం పట్ల ఇతని పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here