హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన పై రెండు తెలుగు రాష్ట్రాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఈ క్రమంలోనే నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలని ఈ నిందితుడు బయట తిరగడానికి వీలు లేదంటూ.. అతనిని ఉరి తీసి చంపాలని పెద్దఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుల్ని పట్టుకోవడం కోసం తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలోనే పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడం కోసం పోలీసులు పది లక్షల రూపాయలు నజరానాలు ప్రకటించారు. నిందితులు ఉపయోగించిన సెల్ఫోన్ ఆధారంగా అతని ఆచూకీ పట్టుకోవడం కష్టతరంగా మారడంతో సిసిటివీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇలా నగరంలో పలు ప్రాంతాల వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాల రికార్డులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉండగా నిందితులు రాజు వివిధ మారువేషాల్లో తిరుగుతూ ఉంటే అతనిని గుర్తించడం కోసం పోలీసులు పలు ఫోటోలను విడుదల చేశారు. తను గుండు కొట్టించుకుని ఉంటే ఏ విధంగా ఉంటాడు అనేటటువంటి ఊహా చిత్రాలను విడుదల చేశారు. ఎవరికైనా అనుమానాస్పదంగా కనపడితే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని అతని చేతి పై మౌనిక అనే పేరు ద్వారా తనని సులభంగా గుర్తించవచ్చు అని పోలీసులు తనకి సంబంధించిన మరికొన్ని వివరాలను తెలియజేశారు.
సీసీటీవీల ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులకు ఉప్పల్ సిగ్నల్స్ దగ్గర నిందితుడు రోడ్డు క్రాస్ చేస్తూ వెళ్తున్న అటువంటి దృశ్యాలను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక వైన్ షాప్ దగ్గర నిందితుడు తన చేతిలో ఉన్న కవర్ పడేయడంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ కవర్ ను స్వాధీనం చేసుకున్నారు.ఆ కవర్‌లో కల్లు సీసా, టవల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాగైనా నిందితుడిని మరో 24 గంటలలో పట్టుకోవాలని హైదరాబాద్ పోలీసులు పలు ప్రాంతాలలో అతని ఫోటోలు చూపిస్తూ గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…