Categories: FeaturedGeneral News

నిందితుడిని పట్టించిన వారికి నజరానా ప్రకటించిన ఆర్పీ పట్నాయక్.. ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలతో పాటు..

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని సైదాబాద్ లో చిన్నారి చైత్ర అత్యాచారం, హత్య కేసు ఘటన పెను సంచలనంగా మారింది. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలిస్తున్నారు. నిందితుడిని పట్టిస్తే ఇప్పటికే ప్రభుత్వం రూ.10 లక్షల రివార్డును ప్రకటించగా.. తాజాగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా రూ.10 లక్షలతో పాటు రూ.50 వేలు నజరానాగా ఇస్తానని చెప్పాడు. ఈ ఘటనపై ఆర్పీ పట్నాక్ తీవ్రంగా స్పందించారు.

ఇటువంటి ఘటనలో నిందితులకు వెంటనే శిక్ష పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. దానికి సంబంధించి అతడు పోలీసులు విడుదల చేసిన అతడి ఫొటో , ఆనవాళ్లను ట్విట్లర్ లో ట్యాగ్ చేస్తూ ఇలా అన్నాడు ‘‘చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మ శాంతించాలంటే, ఈ పల్లకొండ రాజు దొరకాలి. హైదరాబాద్ సిటీ పోలీస్ విడుదల చేసిన ఈ ఆధారాల ద్వారా ఈ నిందితుడిని పట్టుకున్న వారికి 10 లక్షలు రివార్డు ప్రకటించారు.

నా వంతుగా ఆ పట్టించిన వారికి రూ.50 వేలు ఇస్తాను. కానీ ఇతను దొరకాలి.. పోలీసులు ఇచ్చిన అన్ని క్లూస్ మనకి హెల్ప్ కావొచ్చు, కాకపోవచ్చు.. కానీ చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతన్ని పట్టించేలా చేస్తుంది. అతను మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఈ నేరస్తుడిని పట్టుకునే పనిలో మనం కూడా సహకరిద్దాం’’ అంటూ ఆయన పోస్ట్ చేశారు.

అయితే పోలీసులు ఎంత పటిష్టంగా గాలిస్తున్నారో.. నిందితుడు రాజు కూడా అంతే తెలివిగా వారి నుంచి తప్పించుకుంటున్నాడు. ఎన్నో క్లిష్టమైన కేసులను సైతం సునాయాసంగా డీల్ చేసి దేశంలోనే నంబర్ వన్ పోలీసింగ్ వ్యవస్థగా తెలంగాణ పోలీసులు పేరు తెచ్చుకున్నారు. అంతటి పేరున్న పోలీసులకు సైతం ఈ నిందితుడు చిక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago