Tag Archives: hyderabad

హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. ఇకపై కరెంట్ బిల్లు ముందే కట్టాలంట..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరవాసులకు ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. మొబైల్ రీఛార్జ్ చేసుకుని టెలీకాం సేవలను ప్రస్తుతం ఏ విధంగా పొందుతున్నామో ఇకపై నగరవాసులు అదే విధంగా ప్రీ పెయిడ్ మీటర్లను రీచార్జ్ చేసుకుంటే మాత్రమే విద్యుత్ ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. రోజురోజుకు నగరంలో బిల్లులు వేలల్లో పేరుకుపోతూ ఉండటంతో ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

డిస్కం ఉన్నతాధికారులు ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రీ పెయిడ్ మీటర్లను అమర్చగా ఆ సంఖ్యను మరింతగా పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీ పెయిడ్ మీటర్లు అందుబాటులో ఉండగా త్వరలో ప్రైవేట్ కార్యాలయాల్లో సైతం ప్రీ పెయిడ్ మీటర్లు అందుబాటులోకి రానున్నాయి. డిస్కం అధికారులు తక్కువ విద్యుత్ కనెక్షన్లు ఉన్న డివిజన్లను ఎంపిక చేసుకుని ఆ డివిజన్లలో పూర్తిస్థాయిలో ప్రీపెయిడ్ మీటర్లను అమర్చాలని భావిస్తున్నారు.

వినియోగదారులు ముందుగానే రీచార్జ్ చేసుకుని రీచార్జ్ చేసుకున్న డబ్బులు అయిపోయేంత వరకు విద్యుత్ ను వినియోగించుకునే ఛాన్స్ ఉంటుంది. విద్యుత్‌ రంగ నిపుణులు భవిష్యత్తులో పూర్తిస్థాయిలో ప్రీపెయిడ్ మీటర్లు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఫలితంగా మొండి బకాయిలకు సులభంగా చెక్ పెట్టవచ్చన్ చెబుతున్నారు. ప్రజలకు సైతం ప్రీపెయిడ్ మీటర్ల వల్ల ఒకింత ప్రయోజనం చేకూరనుంది.

చాలామంది కరెంట్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల జరిమానాలను చెల్లిస్తున్నారు. అయితే ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులోకి వస్తే మాత్రం జరిమానాల సమస్య కూడా ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్లు సత్ఫలితాలు ఇచ్చాయని స్వయంగా అధికారులు చెబుతూ ఉండటం గమనార్హం.

నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా హైదరాబాద్ లో ఉద్యోగాలు..?

గత కొన్ని రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని ప్రముఖ సంస్థలు నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతుండగా హైదరాబాద్ లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఈఎస్ఐసీ) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈఎస్ఐసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 187 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈఎస్ఐసీ సిద్ధమవుతోంది.

ఫోరెన్సిక్ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, బ‌యోకెమిస్ట్రీ, మైక్రోబ‌యాల‌జీ, పాథాల‌జీ, ఫిజియాలజీ, అనాటమీలలో ఇతర విభాగాల్లోని ఖాళీలను ఈఎస్ఐసీ భర్తీ చేస్తోంది. https://www.esic.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.

మొత్తం ఉద్యోగాల్లో సీనియ‌ర్ రెసిడెంట్ ఉద్యోగాలు 103 కాగా ఫ్యాక‌ల్టీ పోస్టులు 46, అడ్జంక్ట్ ఫ్యాక‌ల్టీ సూప‌ర్ స్పెష‌లిస్ట్ పోస్టులు 15, స్పెషాలిటీ స్పెష‌లిస్ట్ పోస్టులు 7, క‌న్స‌ల్టెంట్‌ పోస్టులు 4, రిసెర్చ్ సైంటిస్ట్‌ పోస్టులు 2 ఉన్నాయి. ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నవంబర్ 11వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 17 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈఎస్ఐసీ అభ్యర్థులకు అర్హతకు, అనుభవానికి తగిన వేతనం అందిస్తోంది.

హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నగరంలోకి ఆ బస్సులు..?

హైదరాబాద్ వాసులకు మళ్లీ పాత రోజులు రాబోతున్నాయి . దాదాపు రెండు దశాబ్దాల క్రితం నగరంలో తిరిగిన డబ్బులు మళ్లీ నగరంలో చక్కర్లు కొట్టనున్నాయి. డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణం చేస్తే ఆ మజానే వేరు. జాయింట్ వెల్ లో తిరిగితే ఎలా ఉంటుందో ఈ బస్సుల్లో తిరిగితే అలాంటి అనుభవమే కలుగుతుంది. అయితే గత కొన్నేళ్ల నుంచి నగరంలో ఇలాంటి బస్సులు తిరగడం లేదు.

రెండు దశాబ్దాల క్రితం తిరిగిన బస్సులు క్రమంగా పూర్తిగా కనుమరుగైపోయాయి. అయితే ఒక నెటిజన్ మంత్రి కేటీఆర్ కు డబుల్ డెక్కర్ బస్సుల గురించి ట్వీట్ చేస్తూ తన బాల్యంలో డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించే వాడిననని చెప్పారు. షాకీర్ హుస్సేన్ అనే నెటిజన్ మంత్రితో డబుల్ డెక్కర్ బస్సులతో ఉండే అనుబంధం గురించి పంచుకున్నారు. 7z అనే నంబర్ తో అప్పట్లో బస్సులు నడిచేవని తెలిపారు.

సికింద్రాబాద్ నుంచి జూపార్క్ వరకు ఈ బస్సులు నడిచేవని.. ఆ బస్సులు మళ్లీ అందుబాటులోకి వస్తే బాగుంటుందని కేటీఆర్ ను కోరారు. ఆ ట్వీట్ ను చూసిన వెంటనే స్పందించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను చిన్నతనంలో అబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూలులో చదువుకునేవాడినని ఆ సమయంలో తనకు డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవని.. ఆ బస్సులను తాను కూడా చూశానని మంత్రి తెలిపారు.

అనంతరం మంత్రి పువ్వాడ అజయ్‌ను ఆ బస్సులను మళ్లీ రోడ్లపైకి తెచ్చే అవకాశం ఉందా అని ట్విట్టర్ లో కేటీఆర్ ప్రశ్నించారు. టీఎస్ఆర్టీసీ ఎండీతో మాట్లాడి సాధ్యమైతే ఆ బస్సులను ప్రవేశపెడతానని తెలిపారు. దీంతో ఆ బస్సులను మళ్లీ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.