Category Archives: Uncategorized

అరకు ఎంపీగా గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా! : కొత్తపల్లి గీత

కొత్తపల్లి గీత.. ఈ పేరు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రభుత్వాధికారిగా.. రాజకీయవేత్తగా అందరికీ సుపరిచితమే.! తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురం ప్రాంతానికి చెందిన గీత ఎంఏ వరకు చదివి గ్రూప్-01 అధికారిగా సేవలందించారు. ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని వదిలేసి 2013లో వైసీపీలో చేరారు. ఆ మరుసటి ఏడాదే 2014లో జరిగిన ఎన్నికల్లో అరకు ఎంపీగా పోటీచేసి 91,398 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన మరుసటి రోజు నుంచే అరుకును అభివృద్ధి బాటలో నడిపించి నియోజకవర్గానికి కావాల్సిన నిధులు, అభివృద్ధి అంటే ఏంటో చూపించారు.

నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వచ్చిన కొన్ని విబేధాలతో బయటికొచ్చి.. ఎంపీగానే కొనసాగుతూ 2018లో స్వయంగా జనజాగృతి పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన సామాజిక వర్గాన్నే కాదు.. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన వారిని అభివృద్ధి బాటలో నడిపించాలనే తపనతో ముందుకొచ్చారు కానీ.. పార్టీ అంటే డబ్బులతో ముడిపడి ఉంటుందని ఆలస్యంగా తెలుసుకుని 2019లో బీజేపీలో విలీనం చేయడం జరిగింది. నాటి నుంచి బీజేపీ నేతగా కొనసాగుతూ నియోజకవర్గానికి తన వంతుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. ఆమె కృషికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పదవి కూడా దక్కింది. అంతేకాదు.. అరకు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్న గీతను సీటు దక్కేలా చేసింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ కొత్తపల్లి దూసుకెళ్తున్నారు.

గిరిజనాభివృద్ధి అనేది నరేంద్ర మోదీతోనే సాధ్యమని గీత గట్టిగా నమ్ముతున్నట్లు తెలిపారు. అరకులో ఇప్పుడున్న పరిస్థితిని పూర్తిగా మార్చడానికి తాను కంకణం కట్టుకున్నానన్నారు. ఎందుకంటే గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదని.. గిరిజనులు అంటే మోదీకి ప్రేమ అని.. దీంతో కచ్చితంగా నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్క గిరిజన బిడ్డను బాగుచేస్తామని.. అది కూటమి గెలిస్తే.. కేంద్రంలో మోదీ వస్తేనే జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక అరకు ఎంపీగా గెలిస్తే.. విద్య, వైద్యం, సొంతింటి కల, యువతను బాగు చేయడం ఈ నాలుగే టార్గెట్‌గా ముందుకెళ్తున్నట్లు తెలిపారు గీత. యువత అంటే ఎంతసేపూ జెండాలు పట్టుకోవడానికి తప్ప.. వారికి ఉద్యోగాలు, ఇండస్ట్రీలు తీసుకొచ్చిన పాపాన వైసీపీ పోలేదన్నారు.

ఇప్పటికే తాను ఎంపీగా పనిచేసినంతకాలం అభివృద్ధికై సాయశక్తులా కృషి చేశానని.. మరోసారి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేతల్లో చూపిస్తామంటున్నారు. తనకు ఎలాంటి ఆస్తులు, అంతస్థులు, గెస్ట్ హౌస్‌లు లేవని ప్రజలే తనకు పెద్ద ఆస్తి అని.. ఎంపీగా గెలిస్తే నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి పనులు పనిచేయడానికే తాను ముందుంటానని చెబుతున్నారు. దీంతోపాటు ఇల్లీగల్ మైన్స్ అనేది లేకుండా చేస్తామని మాటిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో మైనింగ్‌ చేయకుండా ఉండటానికి తనవంతుగా యుద్ధం చేస్తానని.. చట్ట ప్రకారమే చేయడానికి మాత్రమే వీలుకల్పిస్తామని కొత్తపల్లి క్లియర్ కట్‌గా చెబుతున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ మహిళ, గిరిజనులను అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్న మనిషి. అరకులోని ప్రజల జీవన విధానం మార్చి.. ఆ ప్రాంతాన్ని అట్రాక్టివ్ టూరిజం ప్రాంతంగానే కాకుండా.. ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. గిరిజనులను లక్షాధికారి చేయడమే లక్ష్యంగా మోదీ ఉన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలున్నాయో అరకులో కూడా అలాంటివే ఏర్పాటు చేసి.. విదేశీ విద్యకు గిరిజనులను పంపి.. ఇవేకాదు సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేయడానికి ప్రధాని సిద్ధంగా ఉన్నారని గీత చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా.. అరకు ప్రాంతానికి వ్యాపారం పేరిట వచ్చి కొందరు అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయడం.. మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని భూములు రాయించుకుంటున్న వారిపై ఉక్కుపాదం మోపడానికి తన వంతు ప్రయాత్నాలు చేస్తానని కొత్తపల్లి గీత హామీ ఇచ్చారు. వాస్తవానికి తాను దీన్ని రూపుమాపడానికి 2014లో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని.. ఈసారి 2024 ఎంపీగా గెలిస్తే ఎన్నికల ఫలితాలొచ్చిన జూన్-05 నుంచే కచ్చితంగా దీన్ని అణిచివేసే పోరాటం చేస్తానన్నారు. గిరిజన ప్రాంతానికి.. గిరిజన బిడ్డలకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నట్లు గీత వెల్లడించారు.

Crime News : ఆరు నెలలుగా మైనర్ బాలికపై లైంగిక దాడి… ఒంటిపై పంటిగాట్లు గుర్తించి !

Crime News : కాలం గడుస్తున్న కొద్దీ మహిళలు, ఆడపిల్లలపై ఆకృత్యాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. కౌమార దశలో ఉండే పదమూడు సంవత్సరాల మైనర్ బాలిక శారీరంగా వచ్చే మార్పులు ఆమెను ఓ దారుణానికి వాడుకున్నాయి. తాను ఏం చేస్తున్నానో తెలియని చిన్న వయస్సు ఒకవేళ తెలిసినా.. దాని పరిణామాలు ఎలా ఉంటాయో చేసుకోని వయస్సులో ఉంది ఆ చిన్నారి. అయితే ఓ కామ పిశాచికి ఇవే అనుకూలంగా మారాయి.

minor girl sexually attacked from past six months in hyderabad

ఆ చిన్నారీలో వచ్చే శారీరక మార్పులకు తీయని మాటలు చెప్పి తనకు కావాల్సిందేదో తీసుకునేందుకు శతవిధాల ప్రయాత్నాలు చేశాడు. వాడి ప్రయత్నాలకు ఆ బాలిక లొంగిపోయింది. తనకు కావల్సిన విధంగా ప్రవర్తించింది. దీంతో ఆమెను శారీరంగా వాడుకున్నాడు. అదే క్రమంలో శరీరంపై కొరికాడు… కాని ఆ పంటిగాట్లు వాడి పైశాచికత్వాన్ని బయటపెట్టాయి. రెండు రోజుల క్రితం బాలిక ఒంటిమీద పంటిగాట్లను చూసిన తల్లి ఏమైందని అడిగారు. దీంతో జరిగిన విషయాన్ని ఆ బాలిక పూసగుచ్చినట్టు చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది.

minor girl sexually attacked from past six months in hyderabad

జహిరాబాద్‌కు చెందిన మహ్మద్ మోహిజ్‌కు 20 సంవత్సరాలు. అతను నగరంలోని ఎమ్‌ఎస్ మక్తాలోని తన సోదరీ నివాసంలో ఉంటూ వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నాడు. అయితే వారు ఉండే ఇంటిలోనే మరో కుటుంబం కూడా అద్దెకు ఉంటుంది. ఆ ఇంట్లో ఓ మైనర్ బాలిక ఉండడంతో మోహిజ్ ఆ బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆమెను బిల్డింగ్ పైకి తీసుకువెళ్లి లైంగిక చర్యకు పాల్పడుతున్నాడు.

ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందంటే ?

ఇలా ఆరు నెలలుగా తన వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. అయితే ఇటివల ఆ బాలిక శరీరంపై పంటి గాట్లు ఉండడాన్ని గమనించిన తల్లిదండ్రులు గమనించారు. దీంతో ఏం జరిగిందని నిలదీయడంతో ఆసలు విషయం చెప్పింది. దీంతో మోహిజ్ చేసిన దురాగతంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహిజ్‌ను పట్టుకుని దేహశుద్ది చేశారు. ఆతర్వాత స్థానిక పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Viral News : ఒక్క నిమిషంలో ఆ ఘనత సాధించి గిన్నీస్ బుక్ లో చోటు… ఆ కుర్రాడు ఎవరంటే ?

Viral News : గిన్నీస్‌ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్‌ సాధించడం అంటే గొప్ప విషయం అనే చెప్పాలి. అలాంటి రికార్డ్‌ సృష్టించిన వ్యక్తిని తలదన్ని కొత్త రికార్డు సృష్టించడం ఇంకా కష్టం. కానీ మణిపూర్‌కి చెందిన బాడీ బిల్డర్‌ గిన్నీస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్‌ని అతి సునాయాసంగా బద్దలు కొట్టాడు. 24 సంవత్సరాల తౌనోజామ్‌ నిరంజోయ్‌ సింగ్‌ అనే యువకుడు కేవలం నిమిషంలో చేతి వేళ్లను నేలపై మోపి అత్యధిక పుష్‌ అప్‌లు తీసి ఔరా అనిపించాడు.

manipur young boy create world record and got place in guinness book

గతంలో 2009 మే 25న యునైటెడ్ కింగ్డమ్‌ కి చెందిన గ్రాహం మాలీ నిమిషంలో 105 పుష్‌ అప్‌ చేసి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్ నెలకోల్పితే…అతడి రికార్డును బద్దలు కొట్టాడు నిరంజోయ్‌ సింగ్‌. జనవరి 14న ఇంపాల్‌లో ఈ అరుదైన రికార్డును సృష్టించాడు నిరంజోయ్‌సింగ్‌. గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్‌ ప్రతినిధులు, స్థానికుల సమక్షంలో కేవలం 60 సెకన్లలో 109 పుష్‌ అప్స్‌ చేసి తన పేరును గిన్నీస్‌ బుక్‌లో ఎక్కేలా చేశాడు నిరంజోయ్‌ సింగ్.

manipur young boy create world record and got place in guinness book

నిరంజోయ్‌ సింగ్‌కు పుష్‌ అప్స్‌లో గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్ సాధించడమే కాదు గతంలో కూడా ఎన్నో క్రీడలు, ఆటలతో పాటు బాడి బిల్డింగ్‌లో పతకాలు సాధించాడు. మణిపాల్‌ లోని ఇంపాల్‌ ప్రాంతంలో ఇలాంటి యువకులు చాలా మంది యువకులు నిరంజోయ్‌సింగ్‌ని ఆదర్శంగా తీసుకొని క్రీడలపై ఆసక్తి పెంచుకుంటున్నారు.

మణిపూర్ ఆణిముత్యం అంటూ ప్రశంసిస్తున్న ప్రముఖులు…

మణిపూర్‌కి చెందిన ఈ యువకుడు సాధించిన ఈ ఘనతను కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు అభినందించారు. ఊహించని విజయాన్ని దక్కించుకున్నావు అంటూ ట్వీట్‌ చేశారు కిరణ్‌ రిజిజు. అలానే 24 సంవత్సరాల యువకుడు నిమిషంలో 109 పుష్‌ అప్స్ చేయడం గొప్ప విషయమని మణిపూర్‌ మంత్రులు, జిల్లా కలెక్టర్‌ చెప్పుకొచ్చారు. నిరంజోయ్‌సింగ్‌ని సన్మానించారు. నిమిషంలో 120 పుష్‌ అప్స్ చేసేందుకు ప్రయత్నిస్తానంటున్నాడు నిరంజోయ్‌సింగ్‌. అతని ప్రయత్నం సఫలం కావాలని… మరో రికార్డు నెలకోల్పాలని అందరం కోరుకుందాం.

Cyber Crime: మెడికల్ కంపెనీకి భారీ టోకరా వేసిన సైబర్ నేరగాళ్ళు… ఒక్క మెయిల్ తో !

Cyber Crime: దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ లావాదేవీల పెరుగుదలతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. మీ వివరాలను అప్‌డేట్ చేస్తున్నట్లు ఫోన్ చేయడం, మీకు ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేయడం, మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వేర్వేరు మార్గాల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు.

cyber crime happened in hyderabad and looted money with fake mail

తాజాగా హైదరాబాద్‌కు చెందిన మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ కంపెనీ యాజమాన్యానికి భారీ టోకరా వేశారు. ఒక్క మెయిల్‌తో ఏకంగా రూ. 46 లక్షలు కాజేశారు. అది నిజమైన మెయిల్ కాదని, సైబర్ నేరగాళ్ల మాయ అని గుర్తించిన కంపెనీ యాజమాన్యం… సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాలు ప్రకారం… నగరంలోని సంతోష్‌ నగర్‌లో గల ‘సెన్స్‌కోర్‌ మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌’ మెడికల్‌ ఏజెన్సీ, కాలిఫోర్నియోలోని ‘ఏజీ సైంటిఫిక్‌’ కంపెనీతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోంది.

cyber crime happened in hyderabad and looted money with fake mail

ఇందులో భాగంగా ఏడాదిలో మూడు సార్లు ‘ఏజీ సైంటిఫిక్‌’ నుంచి మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను సెన్స్‌కోర్ మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏజెన్సీ కొనుగోలు చేస్తుంటుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్‌ అవసరం ఏర్పడటంతో.. ‘ఏజీ సైంటిఫిక్‌’వారిని సంప్రదించారు ఇక్కడి ఏజెన్సీ వారు. అయితే, ఏజీ సైంటిఫిక్‌ వాళ్లు తమ బ్యాంక్‌ ఖాతాను ప్రతి మూడు నెలలకు మారుస్తుంటారట. దీనిని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు… పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకున్నారు. ‘ఏజీ సైంటిఫిక్‌’ కంపెనీలో ‘ఐ’ అనే లెటర్‌ తీసేసి ఫేక్‌ మెయిల్‌ సృష్టించారు.

మెయిల్ హ్యాక్ చేసి ఎన్ని లక్షలు కాజేశారంటే ?

ఆ ఫేక్‌ మెయిల్‌తో రూ.46 లక్షలకు కొటేషన్‌ను పంపి బ్యాంక్‌ అకౌంట్‌ను కూడా పంపారు. అయితే, ఏజీ సైంటిఫిక్ వారు బ్యాంక్‌ అకౌంట్లను మారుస్తుంటారని, ఈ సారి కూడా అలాగే మార్చి ఉంటారని భావించి వాళ్లు అడిగిన రూ.46 లక్షలను కేటుగాళ్ల పంపిన అకౌంట్లకు పంపారు. అయితే, ఇదంతా గత ఏడాది సెప్టెంబర్‌లో చోటు చేసుకోగా… తాజాగా మీ డబ్బులు రాలేదంటూ ఏజీ సైంటిఫిక్ వాళ్లు మెయిల్ పెట్టడంతో విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Murder Attempt : అనంతపురంలో మళ్ళీ భగ్గుమన్న పాత కక్షలు… కాపుకాసి దాడి చేసిన ప్రత్యర్ధులు !

Murder Attempt : రాయలసీమలో పాత కక్షలు మళ్ళీ భగ్గుమన్నాయి. అనంతపురం జిల్లా లోని బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరు గ్రామంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన వెంకట రమణారెడ్డి, అతని కుమారులు పుల్లారెడ్డి, గరుడ శేఖర్‌రెడ్డి లను టాటా సఫారీ వాహనంతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు.

faction rivalries again raised in anathapuram district

అయితే ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ సోమిరెడ్డి హత్యకు ప్రతీకారంగా అతని కుమారుడు నాగలింగేశ్వర్‌ రెడ్డి, అనుచరుడు పవన్‌కుమార్‌రెడ్డి ఈ హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గతంలో మాజీ సర్పంచ్‌ సోమిరెడ్డి, వెంకటరమణారెడ్డి మధ్య రస్తా విషయంలో గొడవ జరిగింది. దీంతో సోమిరెడ్డిపై వెంకట రమణారెడ్డి, అతని కుమారులు పుల్లారెడ్డి, గరుడ శేఖర్‌ రెడ్డి మొద్దుతో దాడి చేశారు. ఆ దాడిలో సోమిరెడ్డి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

faction rivalries again raised in anathapuram district

దీంతో వెంకటరమణారెడ్డి, అతని కుమారులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వీరి కుటుంబాల మధ్య కక్షలు కొనసాగుతున్నాయి. సోమిరెడ్డి హత్య కేసులో వాయిదాకు హాజరయ్యేందుకు వెంకటరమణారెడ్డి , పెద్ద కుమారుడు పుల్లారెడ్డి, రెండో కుమారుడు గరుడ శేఖర్‌ రెడ్డి పల్సర్‌ బైక్‌ పై సోమవారం ఉదయం 9.30 గంటలకు రేగడికొత్తూరు నుంచి అనంతపురం కోర్టుకు బయలుదేరారు.

అదును చూసుకొని ప్రత్యర్థులపై దాడి…

విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు పామురాయి – సోములదొడ్డి మధ్య పెద్దమ్మ ఆలయ సమీపంలో బైక్‌ను వెనుక నుంచి టాటా సఫారీ వాహనంతో ఢీకొట్టారు. దీంతో ముగ్గురూ గాల్లోకి ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పుల్లారెడ్డి, గరుడ శేఖర్‌రెడ్డి అపస్మారకస్థితిలో ఉండడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు బెంగళూరుకు రెఫర్‌ చేశారు. అయితే సఫారీ తో గుద్దిన వాహనాన్ని నాగలింగేశ్వర్‌ రెడ్డి ఇటీవల ఉరవకొండకు చెందిన వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పై తగిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

పసిడి ప్రియులకు శుభవార్త.. ప్రభుత్వ నిర్ణయంతో వారికి చుక్కలే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగారాన్ని అమితంగా ఇష్టపడే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గోల్డ్ హాల్‌మార్కింగ్ నిబంధనలను కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. 2021 సంవత్సరం జూన్ నెల 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. కేంద్రం ఈ ఏడాదే ఈ నిబంధనలను అమలు చేయాలని ప్రయత్నించినా కొన్ని కారణాల వల్ల నిర్ణయం అమలులోకి రాలేదు.

జువెలరీ సంస్థలు బంగారం కొనుగోలు చేసేవాళ్లను మోసం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త కన్సూమర్ ప్రొడక్షన్ యాక్ట్ ను కేంద్రం అమలులోకి తీసుకొస్తోంది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే కొనుగోలుదారులు మోసపోయే అవకాశాలు ఉండవు. జువెలర్లు కొనుగోలుదారులను మోసం చేస్తే కఠిన శిక్షలు అమలులోకి వస్తాయి. 22 క్యారెట్ల బంగారానికి బదులుగా 18 క్యారెట్లు అమ్మితే కఠిన శిక్షలు అమలవుతాయి.

కేంద్రం ఖచ్చితంగా వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనలను అమలులోకి తెస్తామని ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు బంగారం కొనుగోలు సమయంలో కొనుగోలుదారులు మోసపోయినా ఇకపై మోసపోవడానికి అవకాశం ఉండదు. జైలుశిక్ష పడే అవకాశం ఉండటంతో జువెలరీ సంస్థలు సైతం మంచి ఉత్పత్తులను విక్రయించడానికే ఆసక్తి చూపుతాయి.

జువెలరీ సంస్థలు బీఐఎస్ కింద రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే బంగారం అమ్మడానికి అర్హులవుతారు. ప్రస్తుతం గోల్డ్ హాల్ మార్కింగ్ ను బీఐఎస్ మాత్రమే వేస్తోంది. హాల్ మార్కింగ్ ఉన్న నగలను విక్రయించిన సమయంలో కూడా మంచి రేటుకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. అందువల్ల అలాంటి వాటిని తీసుకోవడం మంచిది.

నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా హైదరాబాద్ లో ఉద్యోగాలు..?

గత కొన్ని రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని ప్రముఖ సంస్థలు నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతుండగా హైదరాబాద్ లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఈఎస్ఐసీ) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈఎస్ఐసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 187 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈఎస్ఐసీ సిద్ధమవుతోంది.

ఫోరెన్సిక్ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, బ‌యోకెమిస్ట్రీ, మైక్రోబ‌యాల‌జీ, పాథాల‌జీ, ఫిజియాలజీ, అనాటమీలలో ఇతర విభాగాల్లోని ఖాళీలను ఈఎస్ఐసీ భర్తీ చేస్తోంది. https://www.esic.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.

మొత్తం ఉద్యోగాల్లో సీనియ‌ర్ రెసిడెంట్ ఉద్యోగాలు 103 కాగా ఫ్యాక‌ల్టీ పోస్టులు 46, అడ్జంక్ట్ ఫ్యాక‌ల్టీ సూప‌ర్ స్పెష‌లిస్ట్ పోస్టులు 15, స్పెషాలిటీ స్పెష‌లిస్ట్ పోస్టులు 7, క‌న్స‌ల్టెంట్‌ పోస్టులు 4, రిసెర్చ్ సైంటిస్ట్‌ పోస్టులు 2 ఉన్నాయి. ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నవంబర్ 11వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 17 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈఎస్ఐసీ అభ్యర్థులకు అర్హతకు, అనుభవానికి తగిన వేతనం అందిస్తోంది.

చింతపండు మన ఆరోగ్యానికి ఎంతగా సహాయ పడుతుందో తెలుసా ??

చింతపండు ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిదే.

చింతపండులో 20.9 శాతం తేమ ఉంటుంది.

  • 3.1 శాతం ప్రొటీన్లుంటాయి,
  • 0.1 శాతం కొవ్వు పదార్థం,
  • 2.9 శాతం ఖనిజాలుంటాయి,
  • 67.4 శాతం కార్బోహైడ్రెస్ ఉంటాయి.

కాల్షియం, పాస్పరస్, ఇనుము, క్రోటిన్ , రిబోప్లవిన్, విటమిన్ ‘సి’ కొద్దీ శాతంలో ఉంటాయి,

అజీర్తిని, చిన్న ప్రేగుల్లో గాస్ ని పోగొడుతుంది. చింతపండు ఆకలి కలిగిస్తుంది. విటమిన్ సి కోసం చింతపండు, చింతకాయ వాడవచ్చు.

కాళ్ళ వాపులకు కొందరు వైద్యులు చింతాకులను నూరి ఆ ముద్ద పట్టిస్తుంటారు. గొంతు వాసినవారికి చింతపండు నీరు వాడుతుంటారు.

వైద్యం మాట ఎలా వున్నా శరీరం ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన పోషక పదార్ధాలు అన్ని కాయగూరల్లో వున్నట్టే చింతకాయలోను ఉన్నాయి. మధ్య వయస్కులు మాత్రం వైద్యుల సలహా మేరకు చింతకాయలు, చింత పండు అధికంగా వాడరు,

కానీ చిన్న వయసు వాళ్ళు చింతకాయను మిగతా కూరల్లాగే తరచూ ఆహారంలో తీసుకోవాలి. ఇది శరీరానికి అవసరమైన చల్లదనాన్నిచ్చి, రోగనిరోధక శక్తిని పెపొందించుతుంది.

నిద్ర సమస్య నుంచి బయటకి రావడం ఎలా ?

సుఖంగా నిద్రపోవాలని అందరు కోరుకుంటారు అయితే కొంత మందికి మాత్రమే అది సాధ్య పడుతుంది. దీనికి కారణం మారుతున్న జీవన శైలి, అయితే శారీరిక శ్రమ చేసి అలసటతో పడుకుని నిద్రపోయేవారికి సౌకర్యాల సమస్య లేదు. కానీ కాస్త సౌకర్యాలకి అలవాటు పడిన వ్యక్తులు సుఖనిద్ర కావాలంటే ఎం చేస్తారు ?

చల్లగా వున్నా గదిలో నిద్ర పోతారా? ఏమో ? అందుకే దీన్ని పరిశీలించే ప్రయోగాలు సాగాయి. 15 నుంచి 30 సంవత్సరాల లోపు వారిని మూడు వర్గాలుగా విభజించి 12, 17, 22 డిగ్రీల వేడిమి గల మూడు గదుల్లో ఒక్కో వర్గాన్ని ఉంచారు.

చల్లగా వున్నా గదిలో నిద్రపోయిన వారికి భయపెట్టే కలలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం కనిపించింది. ఇక కొంత వెచ్చదనం గల గదిలో పడుకున్న వారికీ సుఖ నిద్ర, ప్రశాంతమైన కలలు కలిగాయని తేలింది.

తక్కువ వేడి గల చోట నిద్రిస్తే మనుషుల్లో రక్తప్రసరణ నిర్వహించే నరాల కేంద్ర వ్యవస్థకు వత్తిడిని కలిగించి ఉద్రిక్తతనిచ్ఛే సంకేతాలు పంపుతాయి, కొద్దీ వెచ్చదనం ఉన్న చోట నిద్రిస్తే రక్తప్రసరణను అనువైన వ్యాకోచం నరాల్లో ఏర్పడి మెదడుకు ప్రశాంతతను కలిగించే సంకేతాలు పంపిస్తాయి.