Tag Archives: ICRISAT

టైప్ -2 డయాబెటిస్ తో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చిరుధాన్యాలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల టైప్ -2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఆహారంలో ఇదొక భాగంగా చేసుకుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చక్కెర స్థాయిలను 12 నుంచి 15 శాతం తగ్గించడంలో చిరుధాన్యాలు ఎంతో దోహదపడతాయని.. ‘ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్’ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ఫలితాల్లో వెల్లడించారు.

ఇటీవల The International Crops Research Institute for the Semi-Arid Tropics (ICRISAT) కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. మధుమేహాన్ని నియంత్రించడంలో చిరుధాన్యాలు ఉపయోగపడతాయని.. భారత జాతీయ పోషకాహార బోర్డు ప్రతినిధి, పరిశోధకుడు డాక్టర్ రాజ్ భండారి తెలిపారు. మధుమేహం అనేది 1990 నుంచి 2006 మధ్య వేగంగా పెరిగిందని.. లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన వ్యాధి (GBD) గ్లోబల్ బర్డెన్ ఆఫ్ నివేదిక ప్రకారం వెల్లడైంది.

డయాబెటిస్ కేసులు ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో పెరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఇండియా, చైనా, అమెరికాలో అత్యధికంగా ఉన్నాయని.. ఇంటర్నేషనల్ డయాబెటిస్ అసోసియేషన్ వెల్లడించింది. దీనిని నివారించడానికి మాత్రం సలువైన మార్గం లేదని.. జీవనశైలి, ఆహారంలో మార్పులు చేయడంతో దీనిని నియంత్రించవచ్చని హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత చెప్పారు.

అయితే ప్రస్తుతం వెల్లడించిన పరిశోధన ఫలితాల్లో మాత్రం సామాన్యులకు, ప్రభుత్వాలనకు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ప్రతీ రోజు వ్యాయామంతో పాటు పౌష్టికాహారం తీసుకోవడంతో ఎంతో కొంత మధుమేహాన్ని నివారించవచ్చు అని డాక్టర్ హేమలత తెలిపారు.