Tag Archives: In TDP party

Taraka Ratna: సినిమాలలో మాదిరి కాకుండా రాజకీయాలలోనైనా తారక్ సక్సెస్ సాధించేనా?

Taraka Ratna: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలో హీరోగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కూడా తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్నారు.అయితే ఈయన రాజకీయ వారసులుగా నందమూరి కుటుంబ సభ్యులు కాకుండా నారావారి కుటుంబ సభ్యులు పార్టీ పగ్గాలను తమ చేతిలోకి తీసుకున్నారు.

అయితే నందమూరి వారసులు మాత్రం ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూనే మరోవైపు రాజకీయాలలోకి కూడా వెళ్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ ఒకవైపు సినిమాలు మరోవైపు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మరొక నందమూరి వారసుడు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తనవంతు కృషి చేయనున్నట్లు తెలుస్తుంది.నందమూరి హీరోగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన తారకరత్న సినిమాలలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు.

ఈ క్రమంలోనే ఈయన వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయడమే కాకుండా ఎన్నికలలో పోటీకి దిగి పార్టీ విజయానికి కృషి చేయనున్నట్లు సమాచారం. అయితే ఈయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారనే విషయంలో స్పష్టత లేకపోయినా టిడిపికే అనుకూలంగా ఉన్న నియోజకవర్గంలో పోటీ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.

Taraka Ratna: వచ్చే ఎన్నికలలో పోటీకి సై అంటున్న తారకరత్న..

ఇక ఈయన వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా పోటీ చేస్తారని ఇందులో భాగంగానే ఈయన నారా లోకేష్ ను కలిసి పార్టీ వ్యవహారాల గురించి ప్రస్తావించినట్టు తెలుస్తోంది.ఇక గత కొద్ది రోజుల క్రితం తారకరత్న ఎన్టీఆర్ కూడా సరైన సమయానికి పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటారని చేసినటువంటి కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన ఎన్నికలలో పోటీకి దిగబోతున్నారని తెలియడంతో అభిమానులు సినిమాలలో సక్సెస్ సాధించకపోయినా కనీసం రాజకీయాలలో అయినా సక్సెస్ సాధిస్తారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

NTR -Chiranjeevi: ఎన్టీఆర్ చిరంజీవి మధ్యలో సొంత రాజకీయ పార్టీని స్థాపించిన తెలుగు హీరో ఎవరో తెలుసా?

NTR -Chiranjeevi: సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది.రాజకీయాలలో కొనసాగిన వారు సినిమాలలోకి రావడం సినిమాలలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు రాజకీయాలలోకి వెళ్లడం సర్వసాధారణంగా జరిగే అంశం. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులుగా గుర్తింపు సంపాదించుకొని రాజకీయ నాయకులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో ఎన్టీఆర్, ఎంజీఆర్ జయలలిత వంటి వారు ఒకరు.

ఈ నటీనటులను ఆదర్శంగా తీసుకొని కమల్ హాసన్ చిరంజీవి వంటి తదితరులు కూడా రాజకీయాలలోకి వచ్చారు.ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే నందమూరి తారక రామారావు 58 సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. ఇక ఎన్టీఆర్ స్ఫూర్తిగా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ ఈయనకు పెద్దగా రాజకీయాలు కలిసి రాకపోవడంతో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.

ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి కన్నా ముందుగా మరొక టాలీవుడ్ హీరో సొంతంగా రాజకీయ పార్టీని పెట్టారు. అయితే ఈ రాజకీయ పార్టీ గురించి చాలామందికి తెలియదు. ఇలా ఎన్టీఆర్ తర్వాత సొంత రాజకీయ పార్టీ పెట్టిన హీరో మరెవరో కాదు నందమూరి తారక రామారావు కుమారుడు, నటుడు హరికృష్ణ. ఈయన తన తండ్రి తర్వాత సొంత రాజకీయ పార్టీని పెట్టారు.

NTR -Chiranjeevi: అన్న తెలుగుదేశం పార్టీ…

హరికృష్ణ 1999లో అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు.ఇలా సొంత పార్టీని స్థాపించిన ఈయన గంట గుర్తుతో 1999 సార్వత్రిక ఎన్నికలలో పోటీకి దిగారు. అయితే ఈయన పార్టీ ఏ విధమైనటువంటి ప్రభావం చూపకపోవడంతో హరికృష్ణ తిరిగి టిడిపి పార్టీలో క్రియాశీలకంగా మారి పార్టీ వ్యవహారాలను చూసుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ తరపున ఈయన రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు. అయితే ఈయన పెట్టిన అన్న తెలుగుదేశం పార్టీ గురించి చాలామందికి తెలియదు.