Tag Archives: interest

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.. పూర్తి వివరాలను తెలుసుకోండి..

ఎక్కువ శాతం జనాలు బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడానికే ఇష్టపడుతుంటారు. సీనియర్ సిటిజన్లు అయితే ఇంకాస్త ఎక్కువగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకొని అందులో దాచుకుంటూ ఉంటారు. ఎందుకంటే అందులో సేవిగ్ అకౌంట్లో వచ్చే వడ్డీ కంటే అందులో కొద్దిగా ఎక్కువగా వడ్డీ లభిస్తుంది. అయితే ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంక్‌ను బట్టి ఒక్కోలా ఉంటాయి. వడ్డీ రేట్లు అనేవి పెద్ద బ్యాంకుల్లో తగ్గుతున్నప్పటికీ మూడు సంవత్సరాలు పిక్స్ డ్ డిపాజిట్లను కొనసాగిస్తున్న వారికి 7.25 శాతం వడ్డీ రేటును చెల్లిస్తోన్నట్లు బ్యాంక్ బజార్ తన డేటాలో వెల్లడించింది.

పిక్స్ డ్ డిపాజిట్లపై ఎక్కువగా వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్న బ్యాంకుల్లో ముఖ్యంగా చెప్పుకునేది.. డీసీబీ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌. ఇవి డిపాజిట్ చేసిన మూడేళ్లకు వడ్డీ రేటును 7 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఉదాహరణకు మనం రూ. 2లక్షలు డిపాజిట్ చేస్తే మూడేళ్లలో రూ. 2.46 లక్షలు అవుతుంది. అంటే రూ.46 వేలు వడ్డీ రూపంలో పొందొచ్చు.

అంతేకాకుండా.. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మూడేళ్ల ఎఫ్‌డీలపై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. పెట్టుబడి పెట్టిన రెండు లక్షల రూపాయల మొత్తం మూడేళ్లలో రూ.2.48 లక్షలకు పెరుగుతుంది. అంటే 48 వేలు అధికంగా వస్తాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో అయితే కాస్త తక్కువగా వడ్డీ రేటును అందిస్తోంది. మూడేళ్ల కాలానికి ఎఫ్‌డీలపై 6.85 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.2లక్షల డిపాజిట్ తో రూ. 2.44 లక్షలను మనం తీసుకోవచ్చు.

అంటే 44 వేలు వడ్డీ రూపంలో వస్తాయి. ఇక చివరగా.. ఆర్‌బీఎల్ బ్యాంక్ లో.. మూడు సంవత్సరాల ఎఫ్‌డిలపై 6.80 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.2లక్ష పెట్టుబడి మూడు సంవత్సరాలలో రూ .2.44 లక్షలకు పెరుగుతుంది. అయితే పైన చెప్పిన వడ్డీ రేట్లు కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే వర్తిస్తాయి.

రుణాలు తీసుకున్న వాళ్లకు కేంద్రం శుభవార్త.. వారికి ఊరట..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలో రుణాలు తీసుకున్న వాళ్లకు మేలు జరిగేలా కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ మారటోరియం వడ్డీ మినహాయింపుకు సంబంధించి తాజాగా కేంద్రం నుంచి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ గతంలో లోన్ మారటోరియం ప్రయోజనం కల్పించిన సంగతి తెలిసిందే.

ఎవరైతే లోన్ మారటోరియం పొంది ఉంటారో వాళ్లు ఆరు నెలల లోన్ మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే వడ్డీపై వడ్డీ భారాన్ని మోయనుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి నేడు వడ్డీపై వడ్డీ మాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. 2 కోట్ల రూపాయలకు మించని రుణాలకు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది.

ఎం.ఎస్.ఎం.ఈ రుణాలు, వెహికిల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ రుణాలు, ఎడ్యుకేషన్ రుణాలు తీసుకున్న వారికి కేంద్రం నిర్ణయం వల్ల భారం తగ్గనుంది. కస్టమర్ల లోన్ అకౌంట్లలో ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు, బ్యాంకులు వడ్డీ డబ్బులను జమ చేస్తాయి. సుప్రీం కోర్టు కేంద్రాన్ని త్వరగా వడ్డీ మీద వడ్డీ మాఫీ నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించగా కేంద్రం దసరా పండుగ కానుకగా రుణాలు తీసుకున్న వాళ్లకు శుభవార్త తెలిపింది.

మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు లోన్ మారటోరియం కాలానికి కేంద్రం నూతన మార్గదర్శకాల ప్రకారం వడ్డీ మాఫీ కానుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల లెక్కల ప్రకారం కేంద్రం నిర్ణయం వల్ల 6,500 కోట్ల రూపాయల అదనపు భారం కేంద్రంపై పడనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి వరకు లోన్లు తీసుకున్న వారికి మాత్రమే ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ఆర్బీఐ..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో బ్యాంకు ఖాతా కలిగి ఉన్న వారందరికీ అదిరిపోయే శుభవార్తలు చెప్పింది. ఆర్బీఐ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. బ్యాంకు ఖాతాదారులకు ఇకపై రోజంతా ఆర్టీజీఎస్ అందుబాటులో ఉంటుందని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఈ ఫెసిలిటీ డిసెంబర్ నెల నుంచి అందుబాటులోకి రానుందని చెప్పారు.

ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరిపేవాళ్లు మాత్రమే ఆర్టీజీఎస్ ను ఎక్కువగా వినియోగిస్తారు. ఇప్పటివరకు బ్యాంకు పనివేళల్లో మాత్రమే ఆర్టీజీఎస్ ద్వారా లావాదేవీలు జరిపే అవకాశం ఉండేది. కనీసం 2 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం అవతలి వ్యక్తులకు బదిలీ చేయడానికి ఆర్టీజీఎస్ ఉపయోగపడుతుంది. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపే వినియోగదారులు ఆర్బీఐ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు వడ్డీ రేట్ల విషయంలో సైతం ఆర్బీఐ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఆర్బీఐ కీలక సమీక్షలో వడ్డీరేట్లను కొనసాగిస్తున్నట్టు తెలిపింది. శక్తి కాంత్ దాస్ సారథ్యంలో జరిగిన సమావేశంలో ఎంపీసీ కమిటీ సభ్యులు వడ్డీరేట్లను స్థిరంగా ఉంచడానికి మొగ్గు చూపారు. ఆర్బీఐ నిర్ణయం వల్ల రెపో రేటు 4 శాతం వద్ద కొనసాగుతుండగా రివర్స్ రెపో రేటు 3.35 శాతం దగ్గర కొనసాగుతోంది.

ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వారికి ప్రయోజనం చేకూరనుంది. 2019 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 250 పాయింట్ల వరకు తగ్గించింది. ఫలితంగా రెపోరేటు 2.5 శాతం తగ్గిందని చెప్పవచ్చు. కరోన వైరస్, లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోంది.