ఎక్కువ శాతం జనాలు బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడానికే ఇష్టపడుతుంటారు. సీనియర్ సిటిజన్లు అయితే ఇంకాస్త ఎక్కువగా ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకొని అందులో దాచుకుంటూ ఉంటారు. ఎందుకంటే అందులో సేవిగ్ అకౌంట్లో వచ్చే వడ్డీ కంటే అందులో కొద్దిగా ఎక్కువగా వడ్డీ లభిస్తుంది. అయితే ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంక్‌ను బట్టి ఒక్కోలా ఉంటాయి. వడ్డీ రేట్లు అనేవి పెద్ద బ్యాంకుల్లో తగ్గుతున్నప్పటికీ మూడు సంవత్సరాలు పిక్స్ డ్ డిపాజిట్లను కొనసాగిస్తున్న వారికి 7.25 శాతం వడ్డీ రేటును చెల్లిస్తోన్నట్లు బ్యాంక్ బజార్ తన డేటాలో వెల్లడించింది.
పిక్స్ డ్ డిపాజిట్లపై ఎక్కువగా వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్న బ్యాంకుల్లో ముఖ్యంగా చెప్పుకునేది.. డీసీబీ బ్యాంక్, ఎస్ బ్యాంక్. ఇవి డిపాజిట్ చేసిన మూడేళ్లకు వడ్డీ రేటును 7 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఉదాహరణకు మనం రూ. 2లక్షలు డిపాజిట్ చేస్తే మూడేళ్లలో రూ. 2.46 లక్షలు అవుతుంది. అంటే రూ.46 వేలు వడ్డీ రూపంలో పొందొచ్చు.
అంతేకాకుండా.. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మూడేళ్ల ఎఫ్‌డీలపై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. పెట్టుబడి పెట్టిన రెండు లక్షల రూపాయల మొత్తం మూడేళ్లలో రూ.2.48 లక్షలకు పెరుగుతుంది. అంటే 48 వేలు అధికంగా వస్తాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో అయితే కాస్త తక్కువగా వడ్డీ రేటును అందిస్తోంది. మూడేళ్ల కాలానికి ఎఫ్‌డీలపై 6.85 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.2లక్షల డిపాజిట్ తో రూ. 2.44 లక్షలను మనం తీసుకోవచ్చు.
అంటే 44 వేలు వడ్డీ రూపంలో వస్తాయి. ఇక చివరగా.. ఆర్‌బీఎల్ బ్యాంక్ లో.. మూడు సంవత్సరాల ఎఫ్‌డిలపై 6.80 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.2లక్ష పెట్టుబడి మూడు సంవత్సరాలలో రూ .2.44 లక్షలకు పెరుగుతుంది. అయితే పైన చెప్పిన వడ్డీ రేట్లు కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే వర్తిస్తాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…