చెల్లి పెళ్లికి వెళ్లాల్సిన భార్యను వెళ్లనీయకుండా అడ్డుకుకున్నాడు ఓ భర్త. అక్కడకు వెళ్లకుండా శాడిస్టుల వివిధ చర్యలకు దిగాడు. ఈ ఘటన పూణే లో చోటుచేసుకుంది. అతడు వైద్య రంగంలో ఉన్నాడు. డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే భార్య పల్లవితో కొంతకాలంగా గొడవ పడుతుండేవాడు. ఆయన భార్యకూడా డాక్టరే కావడం విశేషం.
అయితే ఈ విషయాన్ని పల్లవి మొదటి నుంచి అంతగా పట్టించుకునేది కాదు. ఓ సంఘటన మాత్రం ఆమెను తీవ్రంగా కలచివేసింది. చెల్లెలి పెళ్లికి వెళ్లేందుకు సిద్ధమైన పల్లవిని వద్దని వారించాడు ఆమె భర్త రవి. నువ్వు పెళ్లికి వెళ్లడం నాకు ఇష్టం లేదని తెగేసి చెప్పాడు రవి. అందుకు తాను కూడా అస్సలు అంగీకరించనని.. పెళ్లికి వెళ్లి తీరాల్సిందే అంటూ ఆమె కూడా తెగేసి చెప్పేసింది.
దీంతో రవి కోపం పట్టలేకపోయాడు. ఆమె పెళ్లికి వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయాలని ఆలోచించాడు. ఈ క్రమంలోనే ఓ శాడిస్టు ఆలోచన అతడికి తట్టింది. తన భార్య జుట్టు కత్తిరిస్తే పెళ్లికి వెళ్లకుండా ఉంటుందని ఆలోచించాడు. అంతే అనుకున్నదే తడవుగా ఓ కత్తి తీసుకొచ్చి భార్య జుట్టును కత్తిరించేశాడు. దీంతో ఆమె ఈ చర్యకు తీవ్ర కోపంతో ఊగిపోయింది.
రవిపై తీవ్ర కోపంతో అతడిని తిట్టడం మొదలు పెట్టింది. ఇంట్లో ఉన్న ప్రతీ వస్తువును అతడిపై విసిరేయడం చేసింది. అయితే భార్యపై ఇంకా కోపంతో ఉన్న భర్త రవి మరింత రెచ్చిపోయాడు. జుట్టు కత్తిరించిన కత్తితోనే అతడు తన భార్య పొట్టలో పొడిచేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలతోనే ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో రవిని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. తదనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…