Tag Archives: IPL 2022

Virat Kohli: గ్లెన్ మాక్స్‌వెల్ పెళ్ళిలో “ఊ అంటావా మామ” అంటూ సమంత పాటకి స్టెప్పులు వేసిన కోహ్లీ..!

Virat Kohli: ఒకప్పుడు రన్నింగ్ మిషన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ 2022 ఐపీఎల్ లో మాత్రం తన ఆటతో అభిమానులను నిరాశ పరుస్తున్నాడు. 2022 ఐపీఎల్ లో జరిగిన 9 టోర్నీ లలో విరాట్ కోహ్లీ కేవలం 128 పరుగులు మాత్రమే చేసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

ముందు లాగ విరాట్ ఈ మ్యాచ్ లో తన సత్తా చూపించలేకపోతున్నాడు. బ్యాటింగ్ విషయంలో కూడా కోహ్లీ తీరు చూసి అభిమానులు నిరాశా చెందుతున్నారు.2022 ఐపియల్ లో గ్రౌండ్ లో మోత మోగించే ఆటగాళ్ళు గ్రౌండ్ బయట మాత్రం చాలా ఫన్నీగా ఉంటున్నారు.

IPL 2022లో బయో బబుల్ మధ్య కూడా ప్లేయర్స్ అందరూ కలిసి చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు . ఈ క్రమంలో కోహ్లీకి సంబంధిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వివాహ వేడుక ఈ నెల 27 వ తేదీ బుధవారం జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో కోహ్లీతో పాటు మిగిలిన ఆర్సీబి ప్లేయర్లందరూ సందడి చేశారు.

వీడియో వైరల్…

పెళ్లి వేడుకలో బ్లాక్ కలర్ పైజామా ధరించిన కోహ్లీ అందరికీ ఆకర్షణగా నిలిచాడు. వెడ్డింగ్ ఈవెంట్ లో కోహ్లీ, షాబాజ్ అహ్మద్, ప్లెసిస్‌ ముగ్గురు కలిసి డాన్స్ చేస్తూ హంగామా చేశారు. మాక్స్‌వెల్ వెడ్డింగ్ ఈవెంట్‌లో ఈ ముగ్గురు కలిసి పుష్ప సినిమాలో సమంత చేసిన ” ఊ అంటావా మామ ” అనే పాటకు ముగ్గురు డాన్సులు వేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

IPL 2022: మళ్లీ విదేశాలకు ఐపీఎల్ టోర్నమెంట్.. పరోక్ష సంకేతాలు పంపిన బీసీసీఐ..!

IPL 2022: దేశంలో కోవిడ్ మహమ్మారి పరిస్థితులను మరోసారి తలికిందులు చేసేలా కనిపిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు ఇలాంటి భయాల్ని కల్పిస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్ లో పనిచేసే సిబ్బందికి దాదాపు 300 మంది పైగా కోవిడ్ బారిన పడ్డారంటేనే అర్థం చేసుకోవచ్చు… కోవిడ్ థర్డ్ వేవ్ ఎంతలా విరుచుకుపడుతోంది.

IPL 2022: మళ్లీ విదేశాలకు ఐపీఎల్ టోర్నమెంట్.. పరోక్ష సంకేతాలు పంపిన బీసీసీఐ..!

ఇలా దేశంలో ప్రతిరోజూ 1 లక్ష కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలోని చాలా రాష్ట్రాలు వేవ్ నుంచి తప్పించుకోవడానికి నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్లు విధిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ కోవిడ్ వ్యాప్తి అనేది క్రికెట్ పై కూడా పడుతోంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్ లను కోవిడ్ కారణంగా రద్దు అయ్యే అవకాశం ఏర్పడింది.

IPL 2022: మళ్లీ విదేశాలకు ఐపీఎల్ టోర్నమెంట్.. పరోక్ష సంకేతాలు పంపిన బీసీసీఐ..!

బీసీసీఐ ఇప్పటికే అనేక దేశీయ టోర్నమెంట్‌లను రద్దు చేసింది. ఇక గత రెండు సంవత్సరాల నుంచి ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022పై కూడా ఈ ప్రభావం చూపుతోంది.

కోవిడ్ 19 బయో-బబుల్‌ను ఉల్లంఘించినందున ..

రాబోయే నెలల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని బీసీసీఐ నమ్మకంగా ఉంది. అయితే పరిస్థితి మరింత దిగజారితే టోర్నమెంట్‌ను విదేశాలకు తీసుకెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. సాధ్యమైనంతగా ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ బీసీసీఐ టోర్నమెంట్‌ను విదేశాలకు మరిస్తే మాత్రం.. ఇండియాలో కాకుండా వేరే దేశంలో ఐపీఎల్ నిర్వహించడం వరుసగా ఇది మూడో సారి అవుతుంది. ఐపీఎల్ 2020 మొత్తం సీజన్ యూఏఈలో జరిగింది. 2021లో కూడా కరోనా కారణంగా.. ఇండియాలో కేవలం 30 మ్యాచ్‌లను నిర్వహించగలిగింది. అంతే కాదు.. కోవిడ్ 19 బయో-బబుల్‌ను ఉల్లంఘించినందున టోర్నమెంట్‌ను మేలో వాయిదా వేయవలసి వచ్చింది. ఇలా ఐపీఎల్ మాత్రమే కాకుండా.. దుబాయ్ లో 2021 టీ20 వరల్డ్ కప్ ను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమ్ ఇండియా హోమ్ సీజన్‌లో వెస్టిండీస్ , శ్రీలంకలకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. దీని తర్వాతనే ఐపిఎల్‌కు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.