Tag Archives: Iron deficiency

రైతులకు అలర్ట్.. ఈ పంట వేస్తే లక్షల్లో ఆదాయం మీ సొంతం..!

దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని కొత్త పథకాలు అమలు చేస్తున్నా రైతుల జీవితాల్లో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులకు అకాల వర్షాలు, వరదలు నష్టాలను మిగులుస్తున్నాయి. పెరుగుతున్న మందులు, ఎరువుల రేట్ల వల్ల పంట మంచి రేటుకే అమ్ముడయినా రైతులకు లాభాలు రావడం లేదు. అయితే కొన్ని పంటలు వేస్తే రైతులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

కరోనా, లాక్ డౌన్ వల్ల పంట చేతికి వచ్చినా నష్టాలు చవిచూసిన రైతులు మంచి రేటు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తే అధిక మొత్తంలో ఆదాయాన్ని సులువుగా సంపాదించవచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్న పంటల్లో బ్లాక్ వీట్(నల్ల గోధుమలు) ఒకటి. రైతులు ఈ పంట ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడిని, ఎక్కువ లాభాలను సులువుగా పొందే అవకాశం ఉంటుంది.

సాధారణ గోధుమలతో పోలిస్తే ఈ గోధుమలకు నాలుగు రెట్లు ఎక్కువ ధరను పొందవచ్చు. క్వింటాల్ నల్ల గోధుమల ధర 8,000 రూపాయలకు పైగా పలుకుతుంది. పోషకాలు పుష్కలంగా ఉండే నల్లగోధుమలు అనేక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. షుగర్, ఒబెసిటీ, క్యాన్సర్ లాంటి ఆరోగ్య సమస్యలతో బాధ పడే వాళ్లు నల్ల గోధుమలతో చేసిన ఆహారం తీసుకుంటే ఆ సమస్యలు తగ్గుముఖం పడుతాయి.

ఐరన్ లోపంతో బాధ పడే వాళ్లకు సైతం ఆ సమస్యను దూరం చేయడంలో బ్లాక్ వీట్ సహాయపడుతుంది. శీతాకాలం ఈ పంటను పండించటానికి అనువైన కాలం. ఫర్టిలైజర్ దుకాణాలలో ఈ పంటకు సంబంధించిన విత్తనాలు లభిస్తాయి.