Tag Archives: Jabardast actress

Jordar Sujatha: మంత్రి రోజా ఇంట్లో జోర్దార్ సుజాత… పెళ్లి గురించి కీలక అప్డేట్ ఇచ్చిన జబర్దస్త్ నటి!

Jordar Sujatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగడమే కాకుండా ఏకంగా సినిమా అవకాశాలను అందుకొని వెండితెరపై సందడి చేస్తున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ ఒకరు. వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇకపోతే రాకింగ్ రాకేష్ సుజాత ఇద్దరు లవ్ స్కిట్లు చేయటం వల్ల కేవలం జబర్దస్త్ కోసమే ఇలాంటి స్కిట్లు చేస్తున్నారని అందరూ భావించారు కాకపోతే వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాన్ని తెలియజేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. పెళ్లికూడా చేసుకోబోతున్నామని చెప్పిన ఈ జంట తరచూ పలు ప్రాంతాలను సందర్శిస్తూ పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా రాకింగ్ రాకేష్ తో కలిసి సుజాత తిరుపతి వెళుతున్నానని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేశారు. ఇలా తిరుపతి వెళ్తూ దారిలో నగరిలో ఉన్నటువంటి రోజా గారి ఇంటికి వెళ్లి తనని కలిసి వెళ్తామని ఈ వీడియో ద్వారా తెలియజేశారు.ఇక రోజా గారి వల్లే మా ప్రేమ విషయాన్ని బయటకు చెప్పే అవకాశం వచ్చిందని సుజాత ఈ సందర్భంగా వెల్లడించారు.

Jabardasth Rocking Rakesh: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న రాకింగ్ రాకేష్,సుజాత… అసలు విషయం బయటపెట్టిన కమెడియన్!

Jordar Sujatha: రోజా గారి వల్లే ఇదంతా..

ఒకవేళ రోజా గారు లేకపోతే తన ప్రేమ విషయం ఇంత తొందరగా బయటకు రాదని తన వల్లే మా ప్రేమ విషయం బయటపడటమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని తెలిపారు. ఇలా మరి కొద్ది రోజులలో తన పెళ్లి తేదీని కూడా ప్రకటిస్తామని సుజాత చెప్పడంతో ఈ విషయం కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు జోర్దార్ సుజాత, రాకేష్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.